వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు ఇచ్చిన కోవూరు పోలీసులు.
నెల్లూరు జిల్లా: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో వైసీపీ నేత అనీల్ కుమార్ యాదవ్ కు పోలీసులు నోటీసులు అందజేశారు. నోటీసులు ఇచ్చేందుకు కోవూరు ఎస్సై రంగనాధ్ గౌడ్ అనీల్ ఇంటికి వెళ్ళినసమయంలో.. ఆయన అందుబాటులో లేరు. దీంతో ఆయన నివాసానికి నోటీసులు అతికించారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు కోవూరు పోలీసు స్టేషన్ కు రావాలని నోటీసులో పేర్కొన్నారు.