*వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి TV5 సూటి ప్రశ్నలు
*
ఆదిత్య హృదయం ప్రతినిధి
– ఆరోపణలెవరివి? నువ్వు ప్రశ్నించేదెవరిని విజయసాయిరెడ్డి?
– మహిళ భర్త మదన్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదునే చూపించాం
– ఫిర్యాదులో ఆయన పేర్కొన్న అంశాలనే వార్తగా చూపించాం
– ఫిర్యాదులో అంశాలనే ప్రస్తావించాం తప్ప మేం చేసిన ఆరోపణలు కాదు కదా?
– అసలు నువ్వు సమాధానం చెప్పాల్సింది మదన్ మోహన్‌కి కదా?
– మహిళతో నీకెటువంటి సంబంధం లేదని నువ్వే నిరూపించుకోవాలి కదా?
– అసలు మీ సంబంధాలతో మీడియా కి ఏంటి సంబంధం?
– మీరెవరితో ఎలాంటి సంబంధాలు కలిగున్నారో చర్చించే తీరక టీవీ5కి లేదు
– మీరు ఎలాంటి వారో.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో జనాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు విజయసాయిరెడ్డి
– విశాఖ, నెల్లూరు, ఢిల్లీ.. ఇలా అనేక ప్రాంతాల్లో మీ గురించి అనేక ప్రాంతాల్లో అనేక కథలు వినిపిస్తున్నాయి
– వాటి గురించి TV5 ఏం మాట్లాడలేదే?
– ఇప్పుడు జరుగుతుంది ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపైనే చర్చ
– దానికే మీరు వివరణ ఇవ్వాలి విజయసాయిరెడ్డి
– ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మరింత నిజాయితిగా ఉండాలి అదే జనం కోరుకుంటున్నారు
– ఆ మహిళతో మీకు ఎలాంటి సంబంధం లేదని.. మదన్ మోహన్ ఆరోపణల్లో నిజం లేదని చెప్పుకునే ప్రయత్నాలు చేసుకో
– కానీ ఇదంతా మీడియానే చేసిందనే రీతిలో అక్కసు ఎందుకు?
– ఆరోపణలు ఎదుర్కొన్న మహిళ వెర్షన్ కూడా టీవీ5 ప్రసారం చేసింది
– మీ వివరణకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేశాం
– మేము మీడియాగా మా బాధ్యతను నిర్వహించాం నిర్వహిస్తాం
– ఓ వ్యక్తి మీ వ్యక్తిగత జీవితంపై ఆరోపణ చేస్తే.. ఆ రీతితోనే సమాధానం చెప్పాలి
– ప్రజా ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి సమాజానికి కూడా సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉంటుంది
– మీకు చేతనైతే ఆ పనిచేయండి అంతేకాని మీడియాపై నిరాధారణ ఆరోపణలు తగవు విజయసాయిరెడ్డి