వైసీపీకి సుజనా ఫినిషింగ్ టచ్ బీజేపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్ కాషాయ కండువా కప్పుకున్న బుల్లా

Spread the love

వైసీపీకి సుజనా ఫినిషింగ్ టచ్

బీజేపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్

కాషాయ కండువా కప్పుకున్న బుల్లా

విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సుజనా చౌదరికి మద్దతుగా వైసీపీ 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ కుమార్ బీజేపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత అయిన బుల్లా విజయ్ కుమార్ వందలాది మంది అనుచరులతో బీజేపీలో చేరారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని, ఆ స్థాయి గల నాయకుడు విజయ్ కుమార్  అని సుజనా చౌదరి అన్నారు దళిత వర్గానికి చెందిన విజయ్ కుమార్  వంటి నాయకులు బీజేపీలో చేరడం  మరింత బలం చేకూరుస్తుందనే నమ్మకం తమకుందని అన్నారు. ఓటర్లు  13వ తేదీ ఉదయం ఆరు గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని,  75శాతానికిపైగా పోలింగ్ జరిగేలా ఓట్లేయాలని ప్రజలను సుజనా కోరారు.

చవాకులు పేలితే వైసీపీ నేతల తాట తీస్తా-విజయ్ కుమార్  

సీనియర్లకు వైసీపీలో గుర్తింపు లేదని విజయ్ కుమార్  ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న తాను ఎన్నో అవమానాలను భరించానని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసిన తనపై ఎవరైనా తనపై అవాకులు చవాకులు పేలితే తాట తీస్తానని విజయ్ కుమార్   వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ చేరిక నియోజక వర్గానికి నూతన అధ్యాయాన్ని సృష్టి స్తుందనే నమ్మకం తమకు ఉందని టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు. బొమ్మసాని సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, యేదుపాటి రామయ్య, రజనీ, మోబిన్,  తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *