వైసీపీకి బైబై-సుజనాకు జైజై
బుద్ధా దివాకర్ నేతృత్వంలో బీజేపీలో భారీ చేరికలు
భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయం కొన్ని వారాలుగా రద్దీగా ఉంటోంది. కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, పలు పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు. వైసీపీ, కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుతున్నారు. బుధవారం బుద్ధా దివాకర్ నేతృత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ నుంచి భారగా కార్యకర్తలు చేరారు. దినవాహి వారీ సత్రం మాజీ చైర్మన్ బుద్ధా దివాకర్, నేమాల సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, వెంకట ప్రసాద్, కోకా లక్ష్మి, లక్ష్మి బాయ్, దుర్గ తదితరులు దివాకర్ నాయకత్వంలో సుజనా చౌదరిసమక్షంలో బీజేపీలో చేరారు. బీసీ వర్గాల ప్రజలు ఇంత భారీ సంఖ్యలో బీజేపీలో చేరడం తన విజయానికి సంకేతమని సుజనా అన్నారు.