18-07-2025
వైసిపి నాయకులు ఇంటింటికి వెళితే ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
41వ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
ప్రజల అభివృద్ది, సంక్షేమమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ధ్యేయం
41వ డివిజన్ లో అన్ని బూత్ లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పూర్తి
డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ ను అభినందించిన ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ : గత ప్రభుత్వం ప్రజల సంక్షేమం రాష్ట్రాభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలోనే గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం జరిగింది. ప్రజలు వైసిపి నాయకులు చెప్పే బూటకపు మాటలు నమ్మటానికి సిద్దం లేరు. ఇంటింటికి వస్తామన్నా వైసిపి నాయకుల జాడే లేకుండా పోయిందని ఎద్దేవ చేయటంతో పాటు . వైసిపి నాయకులు ఇంటింటికి వస్తే తరిమి తరిమి కొట్టడానికి ప్రజలందరూ సిద్దంగా వున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ భవానీపురం లోని మసీద్ వీధి నుంచి ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు చిట్టాబత్తుని శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ (అన్న), రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ లతో కలిసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన
సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించారు. వారి అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం ఎంపీ కేశినేని శివనాథ్ కి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో 41వ డివిజన్ అన్ని బూతుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముందుగా పూర్తి చేసిందని, ఇందుకు కృషి చేసిన డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ తో పాటు ఆ డివిజన్ టిడిపి నాయకులను అభినందించారు. ప్రజలకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు వుంటే వాటిని నమోదు చేసుకుని అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే… అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తూ, నిత్యం ప్రజలతోనే ఉంటున్నామన్నారు. వైసిపి కి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఇంకా బుద్ది మారలేదన్నారు. . గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్, రౌడీలను ప్రోత్సహిస్తూ , వాళ్లను వెనకేసుకొని తిరుగుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి రాకుండా జగన్ ప్రెస్ మీట్ లకే పరిమితం అయ్యాడన్నారు. ఆ ప్రెస్ మీట్స్ లో కూడా బుద్ది జ్ఞానం లేకుండా ఒక డిజిపి స్థాయి వ్యక్తిని రౌడీగా చిత్రీకరించి మాట్లాడటం జగన్ వక్రబుద్దికి నిదర్శనం అన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా వున్నారని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడే ప్రభుత్వం అన్నారు. పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ది లక్ష్యాలను ఏ విధంగా సాధించాలనే అంశం పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఖాజా, సీనియర్ నాయకులు కరీముల్లా, డివిజన్ నాయకులు నసీమా, సుభాషిణి, అబీబుల్లా, ఫైజా, చైతన్య,తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా,జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సొలంకి రాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ, క్లస్టర్ ఇన్చార్జ్ యేదుపాటి రామయ్య, కో-క్లస్టర్ శివాజీ , మాజీ కార్పొరేటర్లు ఖాదర్,బబ్బూరి నారాయణ స్వామి, , పత్తి నాగేశ్వరరావు, చిన్న సుబ్బయ్య, సుబ్బారెడ్డి, శివశర్మ,ప్రభుదాసు, రేగళ్ల లక్ష్మణరావు, సురభి బాలు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.