వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పై దిశా నిర్దేశం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త పూనూరు గౌతమ్ రెడ్డి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జలసుధీర్ భార్గవ్ రెడ్డి ,
ఈరోజు స్థానిక జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త పూనూరు గౌతమ్ రెడ్డి, మరియు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పాల్గొని ఆయా అనుబంధ విభాగల అధ్యక్షులకు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పై దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా అనుబంధ విభాగాలకు నియోజకవర్గ ,మండల ,పట్టణ, గ్రామ, స్థాయిలో కమిటీల ఏర్పాటు పై పలు సూచనలు చేశారు.అన్ని నియోజకవర్గ విభాగాల జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు