వైభవంగా శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి ఆడికృతికా మహోత్సవం
పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి ఆడికృతిక వేడుకలు ఘనంగా జరిగాయి.
వన్ టౌన్ గాంధీ హిల్ ప్రాంతంలోని శ్రీ బాలసుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృత్తికా నక్షత్ర కావడి ఉత్సవం ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు.
స్వామి భక్తులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.
గాంధీ హిల్ కావడి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, వన్ టౌన్ సిఐ గురుప్రకాష్ పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు.
పలువురు భక్తులు రథయాత్రలో విరివిగా పాల్గొని స్వామి వారి రధాన్ని వీపుపై గుచ్చుకున్న కొక్కేలతో లాగి తమ భక్తిని చాటుకున్నారు. కొత్తపేట సుబ్రహ్మణ్యేరస్వామి ఆలయానికి చేరుకుని వీపుకు గుచ్చిన శూలాలను తొలగించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ వెస్ట్ కన్వీనర్ పొట్టి శ్రీహరి,విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాసరావు, మరియు టీడీపీ సీనియర్ నాయకులు కే జగన్మోహన్,తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ, గడ్డిపాటి కిరణ్, గాంధీ హిల్ కావడి కమిటీ సభ్యులు శ్యామ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు..