వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ కామెంట్స్‌

5
0

 వైద్య ఆరోగ్య శాఖా మంత్రి  స‌త్య‌కుమార్ కామెంట్స్‌

ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అగ్ర‌ స్థానంలో నిల‌పాల‌న్న‌దే నా ఆకాంక్ష‌

రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారు

2100 మంది త‌ల‌సీమియాతో.ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధ‌ప‌డుతున్నారు

జ‌న్యుప‌రంగా వార‌స‌త్వంగా వ‌స్తున్న వ్యాధి ఇది

వ్యాధిని ముందుగా గుర్తించ‌డం చాలా ముఖ్యం

బాధితుల్ని గుర్తించి వారికి క్ర‌మం త‌ప్ప‌కుండా ఉచితంగా ర‌క్త‌మార్పిడి చేస్తున్నాం

రాష్ట్రంలోని 5 ఐసిహెచ్‌య‌స్ సెంట‌ర్ల ద్వారా ముంద‌స్తు వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌ చేస్తున్నాం

వ్యాధి నిర్ణార‌ణ అయిన వారికి ప్ర‌భుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోంది

గిరిజ‌న ప్రాంతాల్లో 19 ల‌క్ష‌ల మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ చేయాల్సి ఉండ‌గా, 10 ల‌క్ష‌ల 50 వేల మందికి స్క్రీనింగ్ చేశారు

ఇందులో 19,000 మంది పైగా క్యారియ‌ర్స్ ఉన్నారు

2100 మందికి వ్యాధి నిర్ధార‌ణ అయ్యింది

జ‌న్యుప‌ర‌మైన సికిల్‌సెల్ ఎనీమియా స్క్రీనింగ్ త‌ర్వాత గుర్తింపు కార్డులిస్తున్నాం

నోడ‌లాఫిస‌ర్లకు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రెండు రోజుల పాటు శిక్ష‌ణ ఉప‌యోగ‌ప‌డుతుంది

కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు దారితీసే విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది

హిమోఫిలియా సోసైటీ, రెడ్‌క్రాస్ సంస్థ‌లు వీటిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎంత‌గానో కృషి చేస్తున్నాయి

ఇత‌ర స్వ‌చ్చంద సంస్థ‌లు కూడా ముందుకొచ్చి భాగ‌స్వాములవ్యాల‌ని ప్ర‌భుత్వం కోరుతోంది

త‌ల‌సీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మ‌రింత అవ‌గాహన క‌ల్పించేందుకు రెండు రోజుల ఓరియెంటేష‌న్ ఎంతగానో తోడ్పడుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here