వైద్యుల సూచనలతో పశుపోషణ లాభదాయకం : యార్లగడ్డ

Spread the love

వైద్యుల సూచనలతో పశుపోషణ లాభదాయకం : యార్లగడ్డ

హనుమాన్ జంక్షన్ :
పశువుల పోషణ లాభసాటిగా ఉండాలంటే వైద్యుల సూచనలను, సలహాలను పాటించాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పశుపోషకులకు సూచించారు. మండల కేంద్రమైన బాపులపాడు లో పశుసంవర్ధక శాఖ, స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా పశువైద్య శిబిరాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా గోవులకు గోపూజ చేసిన అనంతరం ఆయన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పశు పోషణ మన ప్రాంతంలో వారసత్వంగా వచ్చిందని, రైతులకు వ్యవసాయంతో పాటు పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం వచ్చేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశుపోషణ భారంగా మారిందని పేర్కొన్న ఆయన వైద్యుల సూచనలు పాటించి పశు పోషణను లాభసాటిగా మార్చుకోవచ్చన్నారు. వట్టి పోయిన పశువులను కబేళాకు విక్రయించకుండా సరైన వైద్య చికిత్స చేయిస్తే మళ్లీ గర్భధారణ చేసే అవకాశం ఉందన్నారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కూటమి నాయకులతోపాటు పశువైద్యులు సైతం తమవంతు కృషి చేయాలని కోరారు. మూగజీవాలకు వైద్యం చేయటం ఎంతో పుణ్య కార్యక్రమముగా యార్లగడ్డ పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉండటంతో పాలనాపరంగా ఇబ్బందికరంగా మారిందన్నరు. గన్నవరం నియోజకవర్గంలో సొంత నిధులతో సర్వే చేయించగా, మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు మైక్రో ఫిల్టర్ల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాపులపాడు పశు వైద్యశాలను మెరక చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన యార్లగడ్డ మండల పరిషత్ నిధులతో మెరక పనులు చేపట్టాలని ఆదేశించారు. నిర్వాహకులను ఈ సందర్భంగా యార్లగడ్డ అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు మండల టిడిపి అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, స్రవంతి ట్రస్ట్ చైర్మన్ వీరమాచనేని సత్యప్రసాద్, ఉపసర్పంచ్ దుట్టా శ్రీమన్నారాయణ, టిడిపి నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు, ఆళ్ళ గోపాలకృష్ణ, కొమ్మారెడ్డి రాజేష్, మూల్పూరి సాయి కళ్యాణి, మొవ్వ వెంకటేశ్వరరావు, అట్లూరి శ్రీను, మొవ్వ వేణుగోపాల్, చిన్నాల చిన్నా, కడవకొల్లు రాజేష్, తాడిశెట్టి శ్రీను, షేక్ సత్తార్, మున్నంగి బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పశుసంవర్తక శాఖ జెడి ఎన్ నరసింహులు నేతృత్వంలో డిడి చంద్రమోహన్, ఏడీలు ఎం. బాలకృష్ణారావు, ప్రమీలారాణి, పశు వైద్యులు మల్లిబాబు, అభిలాష్, రేవతి తదితరులు పశువులకు వైద్య చికత్సలు చేసి ఉచితం గా మందులు అందచేశారు.
కార్యక్రమం అనంతరం ఇటీవల
అనారోగ్యానికి గురైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తూమాటి ప్రసాదరావును ఎమ్మెల్యే యార్లడ్డ పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పశు వైద్య శిబిరం ప్రారంభించడానికి బాపులపాడు వచ్చిన యార్లగడ్డకు గ్రామ ప్రధాన రహదారి పొడవునా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై బాపులపాడు రోడ్డు నుండి వైద్య శిబిరం జరిగే పశు వైద్యశాల వరకు రహదారి పై మహిళలు హారతులతో స్వాగతం పలికారు.

Loading