08.07.2025
ఇడుపులపాయ
వైఎస్సార్ జయంతి: ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద శ్రీ వైయస్ జగన్ నివాళి
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు.
వైయస్ జగన్ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్ వద్దకు పోటెత్తారు.
ఆందోళన వద్దు.. అండగా ఉంటాం
కడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైయస్ జగన్‌ను కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇడుపులపాయలో వైయస్ జగన్‌ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని వైయస్ జగన్ అన్నారు. ‘‘విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది అని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు విద్యార్థుల వెంట ఉన్నారు.