వేదవ్యాసుని జయంతి సందర్భంగా గురుపూజ మహోత్సవం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 మన దేశంలో గురువులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది 

వేదవ్యాసుని  జయంతి సందర్భంగా గురుపూజ మహోత్సవం 

మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విజయవాడ, జులై 7

మనదేశంలో గురువులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని వేదవ్యాసుని జయంతి సందర్భంగా 

గురుపూజ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్రీయ స్వయంసేవక్ (ఆర్ ఎస్ ఎస్) విజయవాడ మహా నగర్ సంఘ్ చాలక్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని పి.బి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ప్రసంగించారు. 

మనదేశంలో గురువులకు ఇచ్చే ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ వేదవ్యాస జయంతి రోజున గురుపూజ మహోత్సవాన్ని నిర్వహించడం గురువులకు ఇస్తున్న గౌరవాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని 

పురాణాలు ఇతిహాసాలు గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని 

 తల్లిదండ్రులకు ఆయన సూచించారు. మన సంస్కృతి,  సాంప్రదాయాలను కాపాడుకోవాలని 

ఈ బాధ్యత మనందరిపై  ఉందన్నారు. ఈ గురుపూజ మహోత్సవ కార్యక్రమంలో

కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ 

మన దేశం గొప్పతనాన్ని వివరించారు.

హిందూ సాంప్రదాయాల గురించి  విజయవాడ సహా ప్రాంత ప్రచారక్ 

జనార్ధన్ వివరించారు.

 ఆర్ఎస్ఎస్ విజయవాడ మహా నగర్ సంఘ్ చాలాక్  ఏ జి కృష్ణ ప్రసాద్, 

  లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ 

గోకరాజు రామరాజు, 

కేఎంవి  ప్రాజెక్ట్స్  యరమాటి వెంకటేష్,

సూర్యనారాయణ మూర్తి, శ్రీకాంత్ , 

స్వయం సేవక్ లు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *