వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలి

1
0

విజయవాడ నగరపాలక సంస్థ
30-07-2025

వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలి

వీధి వ్యాపారస్తుల సర్వేలో పాల్గొన్న అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయబడును

వీధి వ్యాపారస్తుల సర్వేకి ఆఖరి గడువు ఆగస్టు 5

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో టౌన్ వెండింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వీధి వ్యాపారస్తుల సర్వేకు ఆఖరి గడువు ఆగస్టు 5, 2025 అని, సర్వేలో పాల్గొన్న వారికే ఐడి కార్డులు జారీ చేయబడునని, ఐడి కార్డులు ఉంటేనే వీధిలో వ్యాపారం చేయుటకు అనుమతి ఇవ్వబడునని టౌన్ వెండింగ్ కమిటీ తీర్మానం చేశారు. నగరంలో గల అన్ని రోడ్లను సర్వే చేసి వీధివిక్రయిదారులు వ్యాపారం చేసుకునేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని అన్నారు. ప్రతిరోడ్డులో అంబులెన్స్, ఫైర్ వాహనాలు వెళ్ళుటకు నిర్ణీత స్థలాన్ని వదిలి మిగిలిన ప్రదేశాన్ని వీధివిక్రదారులకు వ్యాపార నిమిత్తం కేటాయించాలని తీర్మానించారు.

నగరపాలక సంస్థ లో గల ప్రతి బోర్డులో ఉన్న అన్ని సచివాలయాల్లో గల ప్రతి రోడ్డును సర్వే చేసి వాటిలో గ్రీన్, రెడ్ మరియు యెల్లో జోన్ల మార్కింగ్లను చేయాలని అన్నారు. మురుగు కాలువపై ఆక్రమణలు చేసి పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలిగి చేసే వీధి వ్యాపారస్తులను తొలగించాలని అన్నారు. ఈట్ స్ట్రీట్ నందు వీధి విక్రయదారుల కొత్త జాబితా తీసుకొని వ్యాపారం చేసుకునేందుకు విలువ స్థలం నిర్దేశించారని అన్నారు.

ప్రజా ప్రతినిధులు, వెండింగ్ అసోసియేషన్ మెంబర్లు, ప్లానింగ్ వెల్ఫేర్ శానిటేషన్ సెక్రటరీల సమన్వయంతో ప్రతి వీధిని సర్వే చేసి జోన్ల వారీగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ మరియు టౌన్ వెండింగ్ కమిటీ చైర్మన్ ధ్యానచంద్ర అన్నారు.

వీధివిక్రయదారులు తమ వ్యాపారం నిమిత్తం ప్లాస్టిక్ బ్యాగులను వినియోగించవద్దని సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని లేనిచో జరిమాన వేధించాలని అన్నారు. వారికి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఎలా ఉంటుంది వాటి వల్ల కలిగే అనర్థాలు పర్యావరణహితమైన వస్తువులను వాడాలన్న అవగాహన సదస్సును నిర్వహించి, వలలో చైతన్యం నింపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్ మరియు టౌన్ వెండింగ్ శర్వాని మూర్తి, టౌన్ వెండింగ్ కమిటీ కన్వీనర్ మరియు ప్రాజెక్టు ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, వీధి వ్యాపారస్తులు షేక్ సబీర్, కంకిపాటి రత్నకుమారి, పిల్లి నాగమల్లేశ్వరి,ఎం కృష్ణ మూర్తి డి.సి.పి (ట్రాఫిక్), తదితర్లు , పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here