Home Political news వివిద అన్లైన్ మెడికల్ సేల్స్ హెడ్స్ మరియు మెడికల్ షాప్స్ అసోసియేషన్

వివిద అన్లైన్ మెడికల్ సేల్స్ హెడ్స్ మరియు మెడికల్ షాప్స్ అసోసియేషన్

2
0

 *ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ. *ది.11.03.2025.*

వివిద అన్లైన్ మెడికల్ సేల్స్ హెడ్స్ మరియు మెడికల్ షాప్స్ అసోసియేషన్

వారికి Drugs and Cosmetics Act,1940 లలో పొందుపరిచిన షెడ్యూల్ డ్రగ్స్ స్టోరేజ్, విక్రయ, వినియోగ నిభంధనలు మరియు అతిక్రమణలపై తీసుకొను చర్యలపై అవగాహన కల్పించిన పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

నగరంలో Drugs and Cosmetics Act,1940 లలో పొందుపరిచిన షెడ్యూల్ డ్రగ్స్ విక్రయం, వినియోగంలో దుర్వినియోగం కాకుండా మరియు సదరు నిబంధనలను అతిక్రమించిన వారిపై తీసుకొను చట్టపరమైన చర్యల గురించి, మెడికల్ హోల్ సెల్ మరియు రిటైల్ డీలర్లకు అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు ఈ రోజు ది.11.03.2025వ తేదిన పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు పోలీసు కమీషనర్  ఆధ్వర్యంలో అన్లైన్ ద్వారా మెడిసిన్స్ లను విక్రయించు వివిధ మెడికల్ సంస్థల స్టేట్ స్టాక్ హోల్డర్స్ మరియు ఎన్ టి. ఆర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మెడికల్ షాప్స్ అసోసియేషన్ వారికీ Drugs and Cosmetics Act,1940 మరియు N.D.P.S Act-1985 లలో పొందుపరిచిన షెడ్యూల్ డ్రగ్స్ స్టోరేజ్, విక్రయం మరియు  వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించినారు. 

ఈ సందర్భంగా  పోలీస్ కమీషనర్  ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. మాట్లాడుతూ… మెడికల్ షాప్స్ అసోసియేషన్ మరియు అన్లైన్ ద్వారా మెడిసిన్స్ లను విక్రయించు వివిధ మెడికల్ సంస్థల స్టేట్ స్టాక్ హోల్డర్స్ వారికీ Narcotic Drugs and Psychotropic Substances Act,1985 మరియు Drugs and Cosmetics Act,1940 లలోని నిభంధనలను క్షుణ్ణంగా వివరించినారు.  NDPS Act లో పొందుపరిచిన షెడ్యూల్ డ్రగ్స్ స్ట్రిప్స్ పై ఎరుపు రంగు NRX లేబుల్ కలిగి ఉంటుందని తెలిపినారు. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలపై వివరించడం జరిగింది. వీటిపై ప్రత్యేక శర్ధ తీసుకుని వాటిపై నిఘా ఏర్పాటు చేయాలని, స్టోరేజ్ విషయంలో నిబంధనల ప్రకారం భద్రపరచాలని, అధికృత పత్రాలను (ప్రిస్క్రిప్షన్) పరిశీలించి అర్హులకు మాత్రమే విక్రయించే లాగా చర్యలు తీసుకోవాలని, వీటి విక్రయాలను ఒక ప్రత్యేక రిజిస్టర్స్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలియపరిచినారు. ఎట్టి పరిస్థితులలోనూ వీటిని సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వినియోగదారులకు అందజేయకూడదు అని, నకిలీ పత్రాలతో మందులు కొనుగోలు వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపినారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తీసుకొను చట్టపరమైన చర్యల గురించి  పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. సదరు విషయాలను ప్రతి ఒక్క మెడికల్ షాప్ నిర్వాహకులకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపినారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తో పాటు ఎస్. బి. మరియు యాంటి నార్కోటిక్ ఇన్ ఛార్జ్ ఎ. సి. పి.  ఎస్. కిరణ్ కుమార్  డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్  అనిల్ కుమార్ నార్కోటిక్ సెల్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ ఈగల్ టీమ్ ఎస్. ఐ. వీరాంజనేయులు  మెడికల్ షాప్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్  సాయి ,వివిధ మెడికల్ సంస్థలైన అపోలో, మేడ్ ప్లస్ మొదలగు రాష్ట్ర స్థాయి మేనేజర్లు మరియు  తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here