03-07-2025
విలక్షణమైన నటనతో ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు ఎస్వీ రంగారావు
- జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో ఎస్వీ రంగారావు జయంతి వేడుకలు
విజయవాడ, జూలై 3 : విలక్షణమైన నటనతో ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు ఎస్వీ రంగారావు అని జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష కొనియాడారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత నటుడు, నాటక రంగ శిల్పి ఎస్వీ రంగారావు జయంతిని స్థానిక పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విజయవాడ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొని ఎస్వీ రంగారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలు, నటనలో చూపిన నైపుణ్యం గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తిరుపతి అనూష మాట్లాడుతూ “తెలుగు సినిమా, నాటక రంగాల్లో ఎస్వీ రంగారావు పాత్ర ఎనలేనిది. ఆయన నటించిన ‘మాయాబజార్’లో ఘటోత్కచుడు, ‘నర్తనశాల’లో కీచకుడు, ‘భక్త ప్రహ్లాద’లో హిరణ్యకశిపుడు వంటి పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. పాత్రలో పూర్తిగా లీనమయ్యే ఆయన శైలి తెలుగు నటనకు ఒక దిక్సూచి. తెలుగు సంస్కృతి, సాహిత్యం, నాట్యరంగానికి ఆయన చేసిన సేవలు భూతదయాళులోనూ చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, జనసైనికులు ఎస్వీ రంగారావు స్మృతులను తలచుకుంటూ, ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, పశ్చిమ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మంతాపురం రాజేష్, 40వ డివిజన్ అధ్యక్షులు శ్యాంసుందర్, 41వ డివిజన్ నాయకులు ఆదిత్య రెడ్డి, షేక్ షరీఫ్, 42వ డివిజన్ నాయకులు అర్జా మార్కండేయులు, షేక్ అలీ, తిరుమ రెడ్డి గణేష్, 43వ డివిజన్ నాయకులు దాసి రామ్మోహన్, వెంకట రమణ, భాగ్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.