*09.11.2024*
విమానాశ్రయంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డకు ఘన స్వాగతo
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ శనివారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్నారు . గన్నవరం విమానాశ్రయం కు చేరుకున్న ఆయనకు కూటమి నేతలు,తెలుగు యువత, టీడీపీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్య లో పాల్గొని శాసనసభ్యులు యార్లగడ్డకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలు , శాలువా లతో సత్కరించి అభినందనలు తెలిపారు . 15 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన ఆయన పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను , పలువురు ఎన్ఆర్ఐలను కోరారు . గన్నవరం ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతానని యార్లగడ్డ స్పష్టం చేశారు . విమానాశ్రయం నుండి నేరుగా కారులో నివాసానికి చేరుకున్నారు . ఈ కార్యక్రమం లో తెలుగుదేశం , భారతీయ జనతా పార్టీ , జనసేన నాయకులు , కార్యకర్తలు , తెలుగు యువత , యార్లగడ్డ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.