17-7-2025
ధి:-18-7-2025 ఈరోజు శుక్రవారం ఉదయం 10:30″గం లకు “
సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆరో స్థానంలో నిలిచిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పై హర్షం వ్యక్తం చేస్తూ 50వేల ఇంటి ఇంటికి తిరిగిన సందర్భంగా కేక్ కటింగ్ మరియు ప్రీతిమ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు పరిపాలనపై ప్రజలు అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగినది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ లు మాట్లాడుతూ:- MLA బొండా ఉమ ప్రజలకు చేరువగా సంక్షేమ పధకాలను తీసుకెళ్లడం, పారదర్శకమైన పరిపాలనను అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నారు అని
బొండా ఉమ నిత్యం ప్రజల సమస్యలను ఆలకించి, వారి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు క్లుప్తంగా వివిరిస్తున్నారు అని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు ముందడుగు వేస్తోందని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపొగపడుతుంది అని, సెంట్రల్ నియోజకవర్గం లో MLA బొండా ఉమ ప్రతీ రోజు ప్రజలకు తనవంతు సహాయం చేస్తుంటారు అని, సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం నందు వినికిడి సమస్య ఉన్నవారికి వినికిడి పరికరాలు, వికలాంగులకు ట్రై సైకిళ్లు, బ్యాటరీ ద్విచక్ర వాహనాలు అందిస్తున్నారు అని
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొదటి నెలలోనే పింఛన్లు వృద్ధులకు 4000 పెన్షన్లు, వికలాంగులకు 6000 పెన్షన్ లు 1వ తారీకు ఉదయం 6 గంటలకల్లా అందజేస్తున్నాం అని, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు తల్లికి వందనం అందచేశాం అని
ప్రతి మహిళా కు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ లు, స్త్రీ నిధి , నిరుద్యోగ భృతి , మహిళకు ఉచిత ప్రయాణం త్వరలోనే అమలు చేస్తాం అని, MLA దృష్టికి, కార్యాలయం వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నాం అని తెలియజేశారు
ఈ కార్యక్రమం లో సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వదలాది మంది పాల్గొన్నారు