Home Political news విప్లవ వీరుడు అల్లూరి పోరాటం యువత కు స్పూర్తి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ...

విప్లవ వీరుడు అల్లూరి పోరాటం యువత కు స్పూర్తి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పి విఎన్ మాధవ్

2
0

 

ఆంధ్రప్రదేశ్

భారతీయ జనతాపార్టీ 

విప్లవ వీరుడు అల్లూరి పోరాటం యువత కు స్పూర్తి

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పి విఎన్ మాధవ్

విజయవాడ… బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కోశాధికారిలు నాగేంద్ర, కందుకూరి సత్య నారాయణ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు 

ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రసంగిస్తూ 

భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహానుభావులు పోరాట ఫలితం.అంతే కాదు స్వాతంత్ర్యం పోరాటం లో ఎందరో యువత బలిదానం చేసారు.తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు 

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు.

అల్లూరి సీతారామరాజు దేశవ్యాప్తంగా భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడు.

అల్లూరి స్పూర్తి యువత తీసుకోవాలి.

భీమవరం లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.అల్లూరి స్పూర్తి కేంద్రాలు అభివృద్ధి కి 90కోట్లు బడ్జెట్ కేంద్రం కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో అల్లూరి జయంతి, వర్థంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయం వివరిస్తూ మన్యం వీరుడు అల్లూరి ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.

ఈకార్యక్రమంలో మహిళా మోర్చా నేతలు లక్ష్మి ప్రసన్న, చిగురు పాటి లక్ష్మి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here