విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం యార్లగడ్డ

Spread the love

విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : యార్లగడ్డ

  • పుకార్లు నమ్మవద్దు తుఫాను బాధితులందరికీ పరిహారం ఇస్తాం
  • తుఫాన్ బాధితుల ఆకలి తీర్చేందుకు అవసరమైతే సొంత నిధులు వెచ్చిస్తా

గన్నవరం :
కోస్తాజిల్లాలను వణికిస్తున్న మెంతా తుఫాను తీవ్రత కారణంగా ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని తుఫాను పునరావాస శిబిరాలను మంగళవారం మధ్యాహ్నం యార్లగడ్డ సందర్శించారు. ముందుగా చెంచుల కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని అనంతరం కేసరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిబిరాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పునరావాస శిబిరంలోని వసతులను పరిశీలించిన ఆయన బాధితులకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరావు మాట్లాడుతూ గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామం తోపాటు చన్నుపల్లి వారి గూడెం, కట్టుబడి పాలెం, కొండపావులూరు, పురుషోత్తపట్నం గ్రామాల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 450 మందిని శిబిరాలకు తరలించినట్లు తెలిపారు. శిబిరాలలో తలదాచుకున్న బాధితులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదృష్టవశాత్తు ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావం తక్కువగా ఉందని, గన్నవరం నియోజకవర్గంలో వర్షపాతం తక్కువగా నమోదు అయిందన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని అధికారులు అందరూ తుఫాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస శిబిరాలకు తరలించేందుకు కృషి చేస్తున్నట్లు యార్లగడ్డ తెలిపారు. వాతావరణ శాఖ అధికారుల అంచనాల మేరకు భారీ వర్షాలు కురిస్తే పునరావాస శిబిరాలను మరిన్ని పెంచాల్సి ఉంటుందని, ఇందుకోసం అవసరమైతే గతంలో బుడమేరు వరదల మాదిరిగా తన సొంత నిధులు వెచ్చించి కళ్యాణ మండపాలను అద్దెకి తీసుకొని బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుఫాన్ బాధితులకు సాయం పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పుకార్లు నమ్మవద్దని హితవు పలికారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా బాధితులందరికీ ప్రభుత్వ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికులు ఇళ్ల స్థలాలు సమస్యను ప్రస్తావించగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉందని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఇల్లు లేని పేద వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సాయం అందించాలని మహిళలు కోరగా సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు తుఫాన్ సహాయ చర్యల్లో పాల్గొని ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తుఫాన్ బాధితులకు అండగా ఉండాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు. జోరు వానలో తడుస్తూనే యార్లగడ్డ సహాయ శిబిరాలను సందర్శన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చిరుమామిళ్ల సూర్యం, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, నాలుగు మండలాల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, దయ్యాల రాజేశ్వరరావు, గొడ్డళ్ళ చిన్న రామారావు, కొలుసు రవీంద్రబాబు, టిడిపి నాయకులు సర్నాల బాలాజీ, కొల్లా ఆనంద్, బొప్పన హరికృష్ణ, బోడపాటి రవి , కోనేరు సందీప్, కుందేటి చంద్రశేఖర్, కోసూరు వెంకట్, అన్నే హరికృష్ణ, మల్లంపాటి జయకృష్ణ, కొసరాజు సాయిరాం, మేడేపల్లి రమ, జాస్తి శ్రీధర్, బండి వెంకట్రావు, కొమ్మరాజు సుధీర్, పడమట రంగారావు, బుస్సే నాగప్రసాద్, పరుచూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Loading