వినియోగదారులకు వెంటనే సర్వీస్ ను అందించాలి

Spread the love

విజయవాడ, తేదీ: 05.12.2025

  • • వినియోగదారులకు వెంటనే సర్వీస్ ను అందించాలి
    • ఏపీసీపీడీసిఎల్ సర్కిల్ ఆఫీస్ సీఎండీ పి. పుల్లా రెడ్డి స్ధానిక పీడబ్ల్యూడి గ్రౌండ్స్ వద్ద గల ఏపీసీపీడీసిఎల్ సర్కిల్ ఆఫీస్ సీఎండీ పి. పుల్లా రెడ్డి శుక్రవారం గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల ఎస్ఈ, డీఈ, ఈఈ, ఎస్ఏఓ లతో నిరంతరాయ విద్యుత్, పీఎం సూర్య ఘర్, రెవెన్యూ కలెక్షన్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు త్వరితగతిన సర్వీసు ఇవ్వాలని , రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలని, లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలని, ఫీడర్స్ అన్నీ బ్రేక్ డౌన్ లేకుండా నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సమీక్ష సమావేశం లో డైరెక్టరు టెక్నికల్ మురళీ కృష్ణ యాదవ్, డైరెక్టరు ప్రాజెక్టు టీ వి ఎస్ న్ మూర్తి, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, సి. జి. ఎమ్ లు జి ఎమ్ లు పాల్గొన్నారు.

Loading