
30.10.2025
విజయవాడ
విధి నిర్వహణలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం
సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్.స్వర్ణలత
ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే మహిళా ఉద్యోగులు అధికారులు విధి నిర్వహణలో అందించే సేవలు ఎంతో కీలకం అని ప్రజలకు ప్రభుత్వానికి వారధి అయిన సమాచార పౌర సంబంధాల శాఖ లో అత్యంత సమర్ధవంతం గా సేవలందించిన సూపరింటెండెంట్ ఎం.రూపవాణి, విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం, లైబ్రేరియన్ గా పనిచేస్తున్న జాస్తి వెంకటలక్ష్మి పనితీరు అభినందనీయమని సమాచారశాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత అన్నారు.ఈ నెల 31 న పదవి విరమణ చేయనున్న రూపవాణి, వెంకటలక్ష్మి లకు రాష్ట్ర సమచార మరియు పౌర సంబంధాల కమిషనర్ కార్యాలయంలో గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ ప్రభత్వ కార్యాలయాలలు పనిచేసే మహిళా ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అని అన్నారు.ఒక వైపు గృహిణిగా మరో వైపు ఉద్యోగి గా భాద్యతలను అలుపెరగక నిర్వహిస్తారని అన్నారు దాదాపు 40 సంవత్సరాలు గా వెంకట లక్ష్మి 33 సంవత్సరాలు గా రూపవాణి వారి భాద్యతలను నిర్వర్తిస్తూ తమదైన శైలిలో సేవలు అందించినఇద్దరు మహిళా సిబ్బందికి పదవి విరమణ శుభాకాంక్షలను తెలియజేస్తూన్నాని తెలిపారు. వారి సేవలు నేటి తరం వారికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు .ప్రభుతవానికీ ప్రజలకు వారిది లా నిలిచే సమాచార శాఖల లో పని చేసే అవకాశం రావడం అదృష్టం గా భావించి ఉద్యోగులంతా సమర్ధవంతం గా పనిచేసి మంచి పేరు సంపాదించాలని కోరారు.
అనంతరం వెంకట లక్ష్మి ప్రసాద్ దంపతులను, రూపవాణి ని సన్మానించారు.కార్యక్రమానిలో రాష్ట్ర సమచార శాఖ జాయింట్ డైరెక్టర్ ఐ.సూర్యచంద్ర రావు డిప్యూటీ డైరెక్టర్లు బి.పూర్ణచంద్ర రావు వెంకట్రాజు గౌడ్, డి. రమేష్ భాస్కరనారాయణ ఎడిలు ఎస్ వి మోహన్ రావు, పి.రాజశేఖర్, ఎ.ఎస్ వీరభద్రరావు, ఎ.నారాయణరెడ్డి, డి ఐపిఆర్ఓ కె వి రమణ రావు, డిఎల్ పి ఆర్ ఓ కె.రవి, విశ్రాంత అధికారి ఎస్ శ్రీనివాస్ జీవన్ యితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
![]()
