
• విద్యార్ధులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాం… పిల్లలు అదరగొట్టారు.
• స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నాం.
• పారిశ్రామికవేత్తలను ఇన్నోవేటర్స్ సదస్సుకు ఆహ్వానిస్తాను… పిల్లల ఆలోచనలు బాగుంటే ప్రతిభను గుర్తించి రివార్డులు అందిస్తాం
• ఉన్నత, విదేశీ విద్య కోసం కలలకు రెక్కలు పేరిట పథకం ప్రారంభిస్తున్నాం
• పావలా వడ్డీతో విదేశీ విద్యకు రుణాలిప్పిస్తాం
• విద్యార్థుల కలలు, కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు
• ప్రభుత్వ పాఠశాలల్లోనూ సోలార్ ప్యానెళ్లు పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేయాలి
• పార్వతిపురం మన్యం జిల్లాలో అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ పాటించాలి
• పిల్లలకు అవసరమైన విద్యను అందిస్తాం… దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
• మంత్రి లోకేష్ విషయమై నేను ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదు… లోకేష్ టీచర్లతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు.
• కొన్ని అంశాల్లో లోకేష్‌కు ఫౌండేషన్ ఇప్పించాం.. ఆ తర్వాత చక్కగా చదువుకున్నారు…ఇప్పుడు మంత్రి అయ్యారు
• రాజకీయాల్లోకి రమ్మని లోకేష్ ను నేను ఫోర్స్ చేయలేదు
• విద్యా శాఖ చాలా కష్టంగా ఉందని చెప్పినా… విద్యా విధానాన్ని తీర్చిదిద్దేలా చేస్తానని లోకేష్ చెప్పారు.
• లోకేష్ తల్లి భువనేశ్వరి స్టాన్ ఫోర్డ్ వరకు తీసుకెళ్లారు… విద్యార్థులను ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత లోకేష్ దే.
• ఏడో తరగతి నుంచి వినూత్నంగా ఆలోచించాలి
• గ్రూప్ గా… వ్యక్తిగతంగా ఇన్నోవేషన్స్ చేసేలా ఆలోచన చేయాలి
• ఆడవారిని హింసించినా.. వేధించినా ఆడబిడ్డలకు భద్రత.. భరోసా కల్పించే బాధ్యత మాది
• డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా చేపట్టే బాధ్యత విద్యార్థులకూ ఉంది.
• తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాల్వ ఏర్పాటు చేస్తాం. వంశధార-పోలవరంను అనుసంధానించి నీటి ఎద్దడి లేకుండా చూస్తాం
![]()
