విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్, షూస్, స్టేషనరీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ

Spread the love

 28-6-2024

33వ డివిజన్ సత్యనారాయణ పురం

ది:28-6-2024 శుక్రవారం ఉదయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణ పురం స్కూల్ నందు ప్రభుత్వం నుంచి విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్, షూస్, స్టేషనరీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న;- సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు,టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలల్లో మరింత ఉత్తీర్ణతను పెంచడానికి తెలుగుదేశం పార్టీ హయాంలో మంచి ప్రణాళికలతో ముందుకు సాగుతుందని, మంచి అధ్యాపకులతో పాటు ఇతర సిబ్బందిని సమకూర్చి విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తూ విద్యార్థులు చదువుకునేందుకు పూర్తి శ్రద్ధను విద్య మీదే చూపేటువంటి విధముగా సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారని వారికి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండిపౌష్టిక ఆహారం ఏర్పాటుచేసి కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా గవర్నమెంట్ స్కూల్ లను తీర్చిదిద్దుతున్నారని..

గవర్నమెంట్ స్కూల్స్ లో గతంలో ఉన్నటువంటి ఉత్తీర్ణత శాతం కన్నా మిన్నగా పెరగవలసినటువంటి అవసరం ఉన్నది అని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలో ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది అని.

గతంలో  పదవ తరగతికి ఉత్థిర్ణతకంటే కూడా  ఈసారి 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యముగా పెట్టుకొని పని చేయవలసినటువంటి అవసరం ఉందని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని గవర్నమెంట్ స్కూల్స్ కు ఉంది అని

ప్రత్యేకించి అధ్యాపకులు విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెరిగేటువంటి విధముగా పాఠాలు బోధిస్తూ వారికి మరింత ఉన్నత స్థానాలకు తీసుకుని వెళ్లే విధముగా పాఠాలు నేర్పిస్తూ ముందుకు సాగాలని

వారి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు దీటుగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం హార్డ్వేర్ రంగాన్ని మరింత విస్తరించింది అని, దానిలో ప్రతి ఒక్కరూ పోటీ పడుతూ భవిష్యత్తులో మన విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులే నేడు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా వెళ్లి మంచి గుర్తింపును తెచ్చుకున్నారని తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేసి, అదేవిధంగా టీచర్లకు సిబ్బందికి కూడా మరింత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విషయాలలో ఆసక్తి చూపాలని సూచనలు చేశారు.

తాను శాసన సభ్యులుగా ఉన్న 2014 నుండి 2019 లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పించినటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి విద్యార్థులకు కానీ సిబ్బందికి గాని ఎటువంటి అవసరం ఉన్న ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తన దృష్టికి తీసుకుని రావాలని, నేటి పిల్లలే రేపటి ప్రతిభ కలిగిన పౌరులుగా దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తారని,చదువులో కానీ క్రీడల లో కానీ ఆసక్తి చిన్ననాటి నుండే అలవర్చుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు విద్యార్థులు చేరుకోవాలని బొండా ఉమా పిల్లలకు ఉపాధ్యాయులకు తెలియజేసారు

ఈ కార్యక్రమంలో:-AKTP స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్,ప్రకాష్,తెలుగుదేశం పార్టీ నాయకులు పాటి విజయకుమార్,నాళం కోటేశ్వరరావు,చామర్తి రవిబాబు,బడేటి ధర్మారావు,తుకారాం,పార్క్ ప్రసాద్ పొట్లూరి,కృష్ణ ప్రసాద్,వేమూరి భాను ప్రసాద్,శంకర సాయి,నిర్మల చౌదరీ,నాగయ్య,కలర్స్ రామకృష్ణ,రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *