విద్యార్థులకు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బలివాడ శివకుమార్ పట్నాయక ఆధ్వర్యంలో పిల్లలకు నోట్ బుక్స్ బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది

Spread the love

ఈరోజు బలివాడ రామారావు పట్నాయక్ జ్ఞాపకార్థం

శ్రీ పుచ్చపల్లి లీల ఎలిమెంటరీ స్కూల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న భాగంగా ఈరోజు విద్యార్థులకు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బలివాడ శివకుమార్ 

పట్నాయక ఆధ్వర్యంలో

 పిల్లలకు నోట్ బుక్స్ బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు నాగోతి రామారావు చేతుల మీదుగా పంపిణీ చేయగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బలివాడ రామారావు పట్నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు శివకుమార్ పట్నాయక్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా గొప్పవని వారు ఇప్పుడే కాదు ఎప్పటినుండో సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ తండ్రి పేరు స్థిరస్థాయిగా నిల్చుకునే విధంగా చూసుకుంటే మంచి వ్యక్తిని శివకుమార్ పట్నాయక్ ని అభినందించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని వారు తెలియజేశారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ భావన పల్లవి మాట్లాడుతూ ఈరోజు పట్నాయక్ నాన్న గారి పేరు మీద శివకుమార్ పట్నాయక్ పుస్తకాలు ఇవ్వడం చాలా ఆనందదాయకమని విద్యార్థులకు స్కూలు ఓపెన్ అయ్యే సమయానికి ఇలా నోట్ బుక్స్ ఇవ్వడం మూలంగా పిల్లలకి ఎంతో సాయం అందిస్తారని తెలియజేశారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం కోటేశ్వరరావు బంగారు రాజు డి శ్రీనివాసరావు అలాగే ఉపాధ్యాయలు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *