విద్యార్థినికి ఆర్థిక సాయం అందిస్తున్న ప్రత్తిపాటి శ్రీధర్

0
0

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం

ఉన్నత విద్యకు ఆర్థిక సాయం..

ప్రతిభ కలిగి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎందరో పేద విద్యార్థులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి తన సుజనా ఫౌండేషన్ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తున్నారు.

పీజీ చదువుతున్న విద్యార్థికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం అందించారు.

విజయవాడ ,చిట్టినగర్ కు చెందిన షేక్ గౌసియా బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల నిమిత్తం దుబాయ్ వెళ్లాలని నిశ్చయించుకుంది..

తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే ఆపవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాన్ని స్థానిక కూటమి నేతలు ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు.

సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సోమవారం గౌసియాను భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయానికి పిలిపించారు. తన కుటుంబ పరిస్థితిని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

సుజనా ఫౌండేషన్ ద్వారా
రూ 20 వేలను ఆర్థిక సాయం అందించారు.

ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి అండగా ఉంటారని ఆయన భరోసానిచ్చారు.

అండగా నిలిచిన ఎమ్మెల్యే సుజనా కు విద్యార్థిని షేక్ గౌసియా ధన్యవాదములు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here