విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అట్టహాసంగా సాగిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ర్యాలీ.

Spread the love

 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అట్టహాసంగా సాగిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ర్యాలీ. 

దారి పొడవునా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, అభిమానులు

ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం.

పార్టీ శ్రేణులు అభిమానులు స్వాగతం పలుకుతూ.. జై జగన…జై వెల్లంపల్లి శ్రీనివాస్ అంటూ నీరాజనాలు పలికారు. 

స్థానిక మహిళలు హారతులు పట్టి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

*ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్.*

సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు వైఎస్ఆర్సిపి కంచుకోటగా తయారు చేశామన్నారు.

బోండా ఉమా రౌడీయిజం రోజురోజుకి పెరిగిపోయి.. ప్రస్తుతం పరాకాష్ట కు చేరుకుందని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

శనివారం నాడు 64వ డివిజన్ నుంచి సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లోని ఆయన పాదయాత్ర నిర్వహించారు. 

మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డ్రైవర్ పై దాడి చేశారని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు తన డ్రైవర్ పై దాడి చేస్తే కనీసం కార్యకర్తలకు ధైర్యం కూడా పవన్ చెప్పలేకపోయారన్నారు. 

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన సభలకు సైతం ప్రజలు రావడం లేదన్నారు. 

పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సిఎం జగన్ వైపే ప్రజలంతా ఉన్నారని ఏ డివిజన్ కి వెళ్ళిన నీరాజనాలు పడుతున్నారని వెల్లంపల్లి అన్నారు. 

పథకాలకు నిధుల విడుదల చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే టిడిపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు.

పేదవాడికి లబ్ధి చేకూరకుండా అడ్డుకున్న ఆదేశాలపై సంతోషాన్ని వ్యక్తం చేయడంతోనే టీడీపీ నాయకుల సైకోతనం బయటపడుతుందన్నారు. 

తన కారు డ్రైవర్ని రక్షించుకోలేని పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఏం రక్షిస్తాడని ఆయన ప్రశ్నించారు. 

ప్రజలందరూ ఇప్పటికే జగన్ కే ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారని, తెలుగుదేశం పార్టీ ఓటమి తప్పదు.

సెంట్రల్ నియోజకవర్గంలో తాను భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు వెల్లంపల్లి చెప్పారు. 

సూపర్ సిక్స్ పేరుతో ఉత్తుత్తి హామీలు ఎన్ని ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. 

శనివారం నాడు ప్రారంభించిన నియోజకవర్గ పాదయాత్రలో చైర్మన్లు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు మహిళలు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి అశ్విని, ఏపీ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ పునురు గౌతం రెడ్డి ,డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, వైసిపి కార్పొరేటర్ కేశినేని శ్వేత, యర్రగొర్ల తిరుపతమ్మ మోదుగుల గణేష్, అలంపురు, విజయలక్ష్మి, ఉమ్మడి రమాదేవి, బెవర నారాయణ మహమ్మద్ షాహినా సుల్తానా, ఈసరపు దేవి, జానారెడ్డి, లక్ష్మీపతి పెనుమత్స శిరీష సత్యం, కనపర్తి కొండ, ఉద్దంటి సురేష్, అంగిరేకుల గొల్లభామ, బంక శకుంతల దేవి కొండయిగుంట మల్లేశ్వరి, బాలి గోవిందు, శర్వాణిముర్తి, గుండె సుందర పాల్, కుక్కల అనిత, ఆత్మకూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *