Home Political news విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వర్గంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ శిక్ష‌ణ కేంద్రాలు పెట్టాల‌ని కోరిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వర్గంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ శిక్ష‌ణ కేంద్రాలు పెట్టాల‌ని కోరిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

4
0

 27-11-2024

విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వర్గంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ శిక్ష‌ణ కేంద్రాలు పెట్టాల‌ని కోరిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

ఎన్.ఎస్.ఐ.సి ప్ర‌ధాన కార్యాల‌యంను సంద‌ర్శ‌న‌

 స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు పెంపొందించేందుకు అధ్య‌య‌నం

ఢిల్లీ: ఎన్టీఆర్ జిల్లాలోని రూర‌ల్, అర్బ‌న్ ప్రాంతాల్లోని యువ‌తీ, యువ‌కులు, నిరుద్యోగుల‌కి స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీలోని ఒఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాలో గ‌ల   ఎన్.ఎస్.ఐ.సి ( నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్) ప్ర‌ధాన కార్యాల‌యాన్ని ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఎగ్జిక్యూటివ్  డైరెక్ట‌ర్ ర‌వి   ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం  సంద‌ర్శించారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు) కింద వున్న ప‌థ‌కాలు,  ఎన్.ఎస్.ఐ.సి టెక్నిక‌ల్ స‌ర్వీస్  సెంట‌ర్ లో నేర్పించే కోర్సులు, అందించే శిక్ష‌ణ కార్య‌క్ర‌మ వివ‌రాలు స్వ‌యంగా తెలుసుకున్నారు. 

 విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో  ఎక్క‌డెక్క‌డ ఎమ్.ఎస్.ఎమ్.ఈ శిక్ష‌ణా కేంద్రాలు పెట్ట‌డానికి అవ‌కాశం వుంటుందో విచ్చేసి ప‌రిశీలించవ‌ల్సిందిగా  ఎమ్.ఎస్.ఎమ్.ఈ అధికారులను కోరారు. ఇలాంటి శిక్ష‌ణ కేంద్రాలు పెడితే జిల్లాలోని నిరుద్యోగులు స్వ‌యం ఉపాధి శిక్ష‌ణ తీసుకుని ఎంట‌ర్ ప్రెన్యూర్ గా మార‌టానికి అవ‌కాశం వుంటుంద‌న్నారు. అక్క‌డ పెట్టే ఎమ్.ఎస్.ఎమ్.ఈ శిక్ష‌ణా కేంద్రాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హాకారాల‌న్నీ త‌ను అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. 

ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎన్.ఎస్.ఐ.సి టెక్నిక‌ల్ స‌ర్వీస్  సెంట‌ర్ మొత్తం స్వ‌యంగా ప‌రిశీలించి అక్క‌డ యువ‌త, మ‌హిళ‌లు ఏ విభాగాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నార‌నే విష‌యాలు అధ్య‌య‌నం చేశారు. అలాగే శిక్ష‌ణ తీసుకున్న త‌ర్వాత వారు తీసుకున్న శిక్ష‌ణ కి సంబంధించి ఉపాధి అవ‌కాశాలు ఏ విధంగా వుంటాయ‌నే విష‌యాలు అడిగి తెలుసుకున్నారు. 

   ఎన్.ఎస్.ఐ.సి అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్ష‌ణ అందించే  ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు మెకాట్రానిక్స్,  ఇండస్ట్రియల్ రోబోటిక్స్ – విజన్ ఇన్‌స్పెక్షన్, పిక్ అండ్ ప్లేస్,  ఆగ్మెంటెడ్ రియాలిటీ / వెర్చువల్ రియాలిటీ / మిక్స్‌డ్ రియాలిటీ ,  రీన్యూబుల్ ఎనర్జీ (సోలార్ ఆధారిత టెక్నాలజీలు),  సైబర్ సెక్యూరిటీ & సైబర్ ఫోరెన్సిక్స్,  యున్మాన్డ్ ఎరియల్ వెహికల్ (డ్రోన్) ద్వారా సర్వేలెన్స్,  అర్డ్యునో ఆధారిత ఎంబెడెడ్ సిస్టమ్ (స్మార్ట్ డివైసెస్, ఐఓటీ), కోఆర్డినేట్ మీజరింగ్ మషీన్ (CMM),  హీట్‌ ఇంగ్, వెెంటిలేషన్ అండ్ ఎయిర్-కండిషనింగ్ (HVAC),  కంప్యూటర్ న్యుమరికల్ కంట్రోల్డ్ మషీన్ (CNC),  కోట్‌లిన్/పైథాన్ ప్రోగ్రామింగ్ & ఆండ్రాయిడ్ యాప్‌లు,  ఇంటీరియర్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ మరియు 3-డి ప్రింటింగ్ వంటి విభాగాల గురించి తెలుసుకున్నారు.  

ముఖ్యంగా విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో రూర‌ల్, అర్బ‌న్ ప్రాంతాల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించేందుకు ఏ విభాగాల వ‌ల్ల ఎక్కువ మందికి స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌నే అంశంపై ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎక్కువ దృష్టి పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here