విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

Spread the love

విజయవాడ నగర పాలక సంస్థ

01-10-2025

సకాలంలో పెన్షన్ పంపిణీ

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం బుధవారం ఉదయం తన పర్యాటంలో భాగంగా లక్ష్మీ నగర్ భగత్ సింగ్ రోడ్, అజిత్ సింగ్ నగర్ పిఎన్టి కాలనీ, ఎక్సెల్ ప్లాంట్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా బుధవారం ఉదయం పిఎన్టి కాలనీలో కమిషనర్ ధ్యానచంద్ర పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా తానే పెన్షన్లు పంపిణీ చేశారు. వార్డు సచివాలయ కార్యదర్శిలు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు కేటగిరి వారిగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం సరైన విధంగా అందుతుందా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎటువంటి అవకతవక్కర్లేదు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల సంతృప్తి స్థాయి మెరుగుపడేలా ప్రభుత్వ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద మొత్తం సర్కిల్ 1 లో 20,319 పెన్షన్లకు 17,849 అందించారని, సర్కిల్ 2 లో 25,740 పెన్షన్లకు 22,348 అందించారని, సర్కిల్ 3 లో 20,301 పెన్షన్లకు 17,452 దాదాపు పంపిణీ చేశారని క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో లబ్ధిదారుల ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చూస్తున్నారన్నారు.

లక్ష్మీ నగర్ భగత్ సింగ్ రోడ్డులో పారిశుద్ధ్య నిర్వహణలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యర్ధాలను నిత్యం ఎప్పటికప్పుడు తొలగించాలని ఇంటివద్దని వ్యర్ధాల సేకరణ చేయాలని స్వీకరించిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు ఎక్స్ఎల్ ప్లాంట్ లో ఉన్న గార్డెన్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు తరలించాలని అక్కడ వ్యర్థ నిర్వహణ సక్రమంగా జరిపిస్తూ అవసరమైన వ్యర్ధాలను రీసైక్లింగ్ కి పంపించాలని, మిగిలిన వ్యర్ధాలు ట్రాన్స్ఫర్ స్టేషన్ నుండి జిందాల్కు ఎప్పటికప్పుడు తొలగించాలని, అధికారులను ఆదేశించారు.

తదుపరి అజిత్ సింగ్ నగర్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్న క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, అన్న క్యాంటీన్లో ఏమైనా రిపేర్ వచ్చినచో వెంటనే వాటిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని, నోడల్ ఆఫీసర్లు అందరూ ఎప్పటికప్పుడు తమ తమ అన్న క్యాంటీన్లలో పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే. ప్రబుదాస్, సి డి ఓ జగదీశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *