విజయవాడ నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన నరసింహ మూర్తి కి సెండ్ ఆఫ్ ఇచ్చిన వి ఎం సి సిబ్బంది

Spread the love

 విజయవాడ నగరపాలక సంస్థ

18-07-2024

 విజయవాడ నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన నరసింహ మూర్తి కి సెండ్ ఆఫ్ ఇచ్చిన వి ఎం సి సిబ్బంది

 విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అకౌంట్స్ ఆఫీసర్గా గత ఆరు ఏలు విధులు నిర్వహించిన కె నరసింహమూర్తికీ పేరెంట్ డిపార్ట్మెంట్ కి బదిలీ వచ్చినందున, అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు కే నరసింహమూర్తి కి సెండ్ ఆఫ్ సభను నిర్వహిస్తూ నూతన అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ మూర్తి కి ఘన స్వాగతం పలికారు.

 ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ మాట్లాడుతూ ఎకౌంట్స్ ఆఫీసర్గా కే నరసింహమూర్తి విధులను ఎంతో నిబద్ధతతో నిర్వహించారని, సమయంతో కొలమానం లేకుండా పనిచేశారని అన్నారు. 

 ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కే సత్యవతి మాట్లాడుతూ తమ మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో చేరినప్పుడు మొట్టమొదటిసారిగా పరిచయమైన వ్యక్తి నరసింహమూర్తిగారని, ఆయన పని తత్వం, విధుల నిర్వహణ ఎంతో కచ్చితంగా చేస్తారని అన్నారు. తదుపరి ఏవోగా పనిచేసిన నరసింహమూర్తి ని సన్మానించి సత్కరించి ఘనంగా వీడ్కోలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఎ మహేష్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కేవీ సత్యవతి, సుపరిండెంట్ ఇంజనీర్ రామ్మోహన్రావు, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *