విజయవాడ నగరపాలక సంస్థలో శాలిగ్రామ పంచాయతీ విజ్ఞాన యాత్ర

Spread the love

విజయవాడ నగరపాలక సంస్థ
03-11-2025

విజయవాడ నగరపాలక సంస్థలో శాలిగ్రామ పంచాయతీ విజ్ఞాన యాత్ర

శాలిగ్రామ నగర పంచాయతీ, ఉడిపి జిల్లా, కర్ణాటక రాష్ట్రము నుండి ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు, ప్రజా ఆరోగ్య సిబ్బంది, వారి విజ్ఞాన యాత్రలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర చాంబర్లో కలిశారు.

ఈ సమావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగరపాలక సంస్థ వారు చేస్తున్న అభివృద్ధి పనులు, వ్యర్ధాల నిర్వహణ, డ్రోన్ సర్వేలెన్సు ద్వారా చేస్తున్న పారిశుధ్య నిర్వహణ వారికి వివరించారు. తదుపరి వారు ఫీల్డ్ లో అజిత్ సింగ్ నగర్ లోని ఎక్సెల్ ప్లాంట్, స్క్రాప్ పార్క్, వెహికల్ డిపో, ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు.

ఈ సమావేశంలో శాలిగ్రామ పంచాయతీ చీఫ్ ఆఫీసర్ అజయ్ బండార్కర్, సుకన్య శెట్టి, వైస్ ప్రెసిడెంట్ గిరిజ పూరి, చైర్మన్ అనసూయ, విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్ర రావు, వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్,శాలిగ్రామ పంచాయతీ బృందం, పాల్గొన్నారు.

Loading