విజయవాడ
ధర్నా చౌక్ వద్ద ఏపీసీసీ ధర్నా
ధర్నా లో పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విద్యుత్ సర్దుబాటు చార్జీలు 17 వేల కోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
*సర్దుబాటు భారం వైసిపి చేసిన పాపం అయితే… కూటమి ప్రభుత్వం పెడుతున్న శాపం – వైఎస్ షర్మిలా రెడ్డి*
వైఎస్ షర్మిలా రెడ్డి
ఏపీసీసీ చీఫ్
– కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది
– 5 నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు
– 5 నెలల్లో చుక్కలు చూపిస్తున్నారు
– దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్నారు
– ఇప్పటికే 6 వేల కోట్ల భారం మోపారు
– ఇది చాలదు అన్నట్లు ఇంకో 11 వేల కోట్లు సిద్ధం చేశారు
– మొత్తం 17 వేలకోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు
– ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు గారు ?
– ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పై ఎన్నో హామీలు ఇచ్చారు.
– వైసిపి 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టారు
– తెలుగు దేశం అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదు అన్నారు
– వైసిపి 35 వేల కోట్లు భారం వేసింది అని చెప్పారు
– కూటమి అధికారంలో వచ్చాకా చార్జీలు 30 శాతం తగ్గిస్తామని చెప్పారు
– అధికారంలో వచ్చాకా మాట మార్చారు
– మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ?
– ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా ?
– జగన్ మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 35 వేల కోట్లు భారం మోపితే…
– మీ 5 నెల్ల పాలనలో 17 వేల కోట్లు భారమా ?
– ఇది న్యాయమా చంద్రబాబు ?
– విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి అన్నారు
– అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి
– హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలి
– కానీ భారాన్ని ప్రజల పై ఎందుకు మోపుతున్నారు ?
– చంద్రబాబు సమాధానం చెప్పాలి
– ఇప్పటికే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు
– గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపుతారా ?
– బాబు గారు కేంద్రం నుంచి నిధులు తీసుకు రండి
– సెంట్రల్ erc మీ చేతుల్లోనే ఉంది
– కేంద్రం నుంచి నిధులు తెచ్చి విద్యుత్ బిల్లులు మీరే చెల్లించండి
– బీజేపీ కి గత 10 ఏళ్లుగా ఊడిగం చేస్తున్నారు కదా
– బీజేపీ కి మద్దతు ఇచ్చిన మీరు నిధులు తేవాలి కదా
– ప్రజల నెత్తిన విద్యుత్ భారం వేస్తే ఊరుకోం
– వెంటనే సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి
– ఇప్పటికే సూపర్ సిక్స్ అమలు లో ఫెయిల్ అయ్యారు
– సంక్షేమ పథకాలు అని చెప్పి… ఒక చేత్తో ఇస్తున్నారు
– మరో చేత్తో వసూలు చేస్తున్నారు
– గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు.. ఇచ్చేది 25 వందలు…వసూలు చేసేది 6 వేల కోట్లు
– ఇచ్చేది పావలా… వసూలు చేసేది రూపాయి
– సర్దుబాటు భారం వైసిపి దే
– కాదని ఎవరు అనడం లేదు
– తప్పు చేశారు కాబట్టే ప్రజలు వైసిపి కి బుద్ధి చెప్పారు
– 35 వేల కోట్ల భారం వేశారు కాబట్టే ప్రజలు వైసిపి నీ ఓడించారు
– ఇది వైసిపి చేసిన పాపం అయితే… కూటమి పెడుతున్న శాపం
– వైసిపి కి కూటమి కి తేడా లేదు