
విజయవంతంగా ముగిసిన ఉద్భవ్-2025 వేడుకలు
కేఎల్ యూనివర్శిటీలో మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన ఉద్భవ్-2025
దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలనుండి వేడుకల్లో పాల్గొన్న 1500 మంది విద్యార్థులు
వేడుకలలో భాగంగా సంప్రదాయ నాటిక, నృత్య, సంగీత పోటీలు
49 విభాగాలకు సంబంధించి పోటీల ఫలితాలు వెల్లడి మరియు విజేతలకు బహుమతుల ప్రధానం*
గిరిజన విద్యార్థుల కళా నైపుణ్యాలను, ప్రతిభను వెలికితీసి దేశవ్యాప్తంగా చాటి చెప్పాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరవ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సొసైటీ సంప్రదాయ మరియు సంస్కృతీ కళా ఉత్సవం ఉద్భవ్-2025 ఉత్సవాల ముగింపు వేడుకలను విజయవాడలోని లో కే ఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో కృష్ణ జింక ప్రధాన వేదికపై శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం, సచివాలయం & గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి, డోలా బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ మరియు రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం, సచివాలయం & గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి, శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ … …ఈ ఆరవ జాతీయ కళా ఉత్సవ్ ఉద్భవ్-2025 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ వేడుకలకు 22 రాష్ట్రాల నుండి విద్యార్థులు హాజరవడం జాతీయ సమగ్రతకు మరియు ఐక్యతకు నిదర్శనమన్నారు. అంతే కాకండా మన దేశం యొక్క వైవిద్యభరితమైన సంస్కృతి మరియు సంప్రదాయాలు, అభిప్రాయాలు మరియు ఆలోచనలు, ఒకరికొకరు పరస్పరం మార్చుకోవడానికి, అవలంభించాడనికి ఉద్భవ్-2025 వేడుక ఒక వేదిక అవుతుందన్నారు. అంతే కాకుండా మన దేశం అన్ని రంగాల్లో వేగంగా ముందుకు సాగుంతుందని, ఇలాంటి వేడుకలు భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శిగా ఉంటుందని పేర్కొన్నారు. దేశం ఎలా అయితే వేగంగా అభివృద్ధి చెందుతుందో, ఆంధ్ర ప్రదేశ్ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెడుతున్నదని, ఇందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గిన్నీస్ బుక్ లో నమోదు అయ్యే రీతిలో నిర్వహించమని, అరకు కాఫి కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు.
ఉద్భవ్-2025 ఉత్సవాలు దేశం నలుమూలల్లోని గిరిజనుల యొక్క సంప్రదాయాలు, సంస్కృతులను కలిపి ఒకే చోట ప్రతిబింభించే కార్యక్రమమని, ఈ పండుగకు భారతీయ కుటుంబం కలిసి వస్తుందన్నారు. ఉత్సవ్ అంటే మన మూలం మరియు మన దేశానికి ఒక అందమైన నిర్వచనమన్నారు. ఈ ఉద్భవ్-2025 లో భాగంగా 35 ఈవెంట్ లలో దాదాపు 1500 విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు అద్భుతమని, గెలుపు, పథకాలతో సంబంధం లేకుండా ఈ వేడుకలను, కరతాళ ధ్వనిని ప్రతి విద్యార్ధి గుర్తుంచుకోవాలని, ఈ వేడుకల ద్వారా లభించిన విశ్వాసాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వేదిక పైన నిలబడినపుడే మీరు విజేతలయ్యారని అంతే కాకుండా మిరే గిరిజన భారతదేశానికి భవిష్యత్ నాయకులని విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడారు. గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి బోధన మరియు సమాన అవకాశాలను కల్పిస్తే వారు చరిత్రను సృష్టించగలరని నిరూపించారన్నారు. విద్యార్థులు కష్టపడి చదవి వైద్యులు, ఇంజనీర్లు, కళాకారులు మరియు వాస్తుశిల్పుల అవ్వాలనే తమ కళలను సాకారం చేసుకోవాలని యువ భారతం మీకోసం ఎదురుచూస్తుందని, భారత దేశపు భవిష్యత్తుకు పునాది విద్యార్థులేనని, ఈ కార్యక్రమంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
గిరిజన సంక్షేమం, మహిళాభివృద్ధి శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి మాట్లాడుతూ …
ఉద్భవ్ మహోత్సవానికి విచ్చేసి కార్యక్రమాన్ని ఆశీర్వదించిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు మనందరికీ ఎంతో ఇష్టమైన విశిష్ట అతిథి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి లకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి 22 రాష్ట్రాల నుండి 405 ఈఎం ఆర్ఎస్ స్కూళ్లకు చెందిన 1800 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. వేరు వేరు ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నా.. మనందరం భారతీయులమే, మనం ఆదివాసీలమే అన్న భావనతో అందరూ ఐకమత్యంగా పాల్గొనడం అభినందనీయం అన్నారు.
అనేక రంగాల్లో గిరిజన విద్యార్థుల ప్రతిభ అసాధారణమని చెబుతూ, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన 110 మంది విద్యార్థుల్లో కొందరు 108 సార్లు సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నిలిచిన విశాఖ యోగా చాంపియన్స్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన అరకు కాఫీని పండిస్తున్న గిరిజన రైతుల కృషిని గుర్తుచేసి, ఆ కాఫీని దేశ విదేశాల్లో ప్రమోట్ చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కృషి అభినందనీయమన్నారు. గిరిజన కళా సంపద, సంప్రదాయాలు, ప్రతిభను ప్రతిబింబించే నాటికలు, ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ గిరిజన విద్యార్థులు రాణించడం అభినందనీయం అన్నారు.
స్వాతంత్య్రోద్యమం లో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు ను మరువలేమన్నారు.. బిర్సా ముండా వంటి గిరిజన ఉద్యమ నాయకులను స్మరిస్తూ వారి త్యాగాలు, విలువలు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉండాలని ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నామన్నారు..
తదుపరి రోజుల్లోనూ ఇలాంటి సాంస్కృతికోత్సవాల ద్వారా గిరిజన విద్యార్థులలోని కళా నైపుణ్యాలను వెలికితీసి, వారికి ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మూడు రోజుల మహోత్సవం నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే క్షమించమని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గిరిజన శాఖ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా 405 EMRS స్కూళ్ల నుండి పాల్గొన్న విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ మహోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సుధా భార్గవి, గురుకులం సెక్రెటరీ గౌతమి లతోపాటు హాజరైన ఇతర ప్రముఖులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు
కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ. …
దేశవ్యాప్తంగా విద్యార్థులు తరలివచ్చి ప్రతిభ చూపడం అసాధారణ విషయమన్నారు. ఇటువంటి జాతీయ స్థాయి కార్యక్రమానికి ఏపీ వేదిక కావడం గర్వించే విషయమని అన్నారు. సరైన సదుపాయాలు లేని చోటు నుంచి సమగ్ర అభివృద్ధి సాధించడం సామాన్య విషయం కాదని వెల్లడించారు. అడవిలో పుట్టిపెరిగిన వారు సైతం అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ సాంస్కృతి, సాహిత్య మరియు కళా ఉత్సవ్ ఉద్భవ్-2025 వేడుకలు ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ దిశానిర్దేశంలో ఇలాంటి గొప్పవేడుక విజయవంతంగా జరుపుకోవడం గర్వించదగ్గ అంశం అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన బిడ్డలకు ఇలాంటి సాంస్కృతిక పోటీలను నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది బాలబాలికలు తమ అద్భుత ప్రతిభ పాఠవాలతో దేశ సంస్కృతిని సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటడం, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన కళలను ఒకే వేదికపై చూడటానికి రెండు కళ్లు సరిపోలేదన్నారు.. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.
భిన్న జాతులు, సంస్కృతులు కలిగిన సువిశాల భారత దేశంలో గిరి పుత్రుల ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసిన ఉద్భవ్ చరిత్రలో నిలుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి అభినందనలు తెలిపారు. గొప్ప ప్రదర్శనలకు చిరునామాగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ సాగుతుండటం గొప్ప విషయం అన్నారు. చదువుతోపాటు ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అందించడం సామాన్యమైన విషయం కాదన్నారు. గిరిజన బిడ్డలకు అత్యుత్తమమైన, నాణ్యమైన విద్యనందించడమే కాకుండా క్రీడలు, కళల్లోనూ మెరికల్లా తీర్చిదిద్దుతున్న అధ్యాపకులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. గిరిజన కళల గురించి, మన ఆచార, వ్యవహారాల గురించి దేశవ్యాప్తంగా మార్మోగేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ ఉద్భవ్-2025 ద్వారా గిరిజన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు ఎక్కడో కొండకోనల్లో, అడవి తల్లి ఒడిలో నాగరిక సమాజానికి దూరంగా ఉండే అడవి బిడ్డల్లోని భయం, బిడియం పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని, కళల్లో సత్తా చాటాలి అనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఉద్భవ్ అంటే ఉద్భవించడం అని, గిరి పుత్రుల్లో కొత్త ప్రతిభను ఉద్భవింపజేసిన వేదికని అర్థం అన్నారు. గిరి పుత్రుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రోత్సహిస్తున్నాయి అన్నారు. తద్వారా ఎంతోమంది గిరిజన బిడ్డలు స్టార్లు, సూపర్ స్టార్లుగా ఎదుగుతున్నారన్నారు. మన గిరిజన కళలు ఎంతో ప్రాచీనమైనవని, ఇలాంటి కళలను పట్ల అభిరుచిని, వాటిని సంరక్షించి, భావి తరాలకు అందించాలన్న స్ఫూర్తిని పిల్లల్లో కలిగించే ప్రయత్నం ఈ ఉద్భవ్-2025 ద్వారా జరిగినందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కందల దుర్గేష్ వెల్లడించారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లికార్జున్ నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 740 ఈఎంఆర్ఎస్ లోని దాదాపు 1800 మంది విద్యార్థులు ఉద్భవ్ కళా వేడుకలలో పోటీ తత్వంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఉద్భవ్-2025కు ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. . ఉద్భవ్-2025ను విజయవంతం చేయడానికి కృషి చేసిన కేంద్ర ,రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ లోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు.
ఎన్ ఈ ఎస్ టీ ఎస్ జాయింట్ కమిషనర్ బిపిన్ చంద్ర రాటురి మాట్లాడుతూ విద్యార్థులను సాంస్కృతిక సాహిత్యం కళారంగాల్లో గిరిజన విద్యార్థులను ప్రోత్సహించేందుకే ప్రతి సంవత్సరం ఈఎంఆర్ఎస్ కళా ఉత్సవాలను నిర్వహిస్తుమన్నారు. కేఎల్ యూనివర్సిటీలో 6వ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్.. జాతీయ సాంస్కృతి, సాహిత్య మరియు కళా ఉత్సవ్ ఉద్భవ్ -2025 వేడుకలు ఘనంగా, విజయవంతంగా జరిగాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన బిడ్డలకు ఇలాంటి సాంస్కృతిక పోటీలను నిర్వహించడం గొప్ప పరిణామం అని, మూడు రోజల పాటు 49 విభాగాల్లో దాదాపు వందలాది మంది బాలబాలికలు అద్భుత ప్రతిభ పాఠవాలతో మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటారని కొనియాడారు. ఎన్నో స్థాయిలు దాటి పలు రాష్ట్రాల నుండి ప్రతిభ గల 558 స్టూడెంట్స్ పాల్గొన్నారని,137 మంది కమిటీ సభ్యులు పని చేసారన్నారు. మూడు రోజుల వేడుకల్లో గిరిజన సంస్కృతి ప్రతిబింబించిందని, అందరూ చురుకైన పాత్ర పోషించారన్నారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజ నేయ స్వామి, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి గౌతమీ ఐఏఎస్ మాట్లాడుతూ ఉద్భవ్ వేడుకలలో గత మూడు రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఈఎంఆర్ఎస్ విద్యార్థులు గిరిజన ప్రాంతాల సంస్కృతలను, కళారూపాలను అత్యద్భుతంగా ప్రదర్శించి ఇండియా హెరిటేజ్ ను ఆవిష్కరించారన్నారు. ఉద్భవ్-2025 వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమివ్వడం మరచిపోలేని అనుభవం అని చెప్పారు. ఈఎంఆర్ఎస్ విద్యార్థుల కళా నైపుణ్యాలు ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి ఉద్భవ్-2025 గొప్ప వేదిక అని వివరించారు. సంస్కృతి ఆత్మ..కళ అభినయం..సాహిత్యం మన ఆలోచన అని, దేశ సృజన, సంస్కృతి, ఐక్యతని ప్రపంచానికి చాటిన ఈ ఈవెంట్ హీరోలు ఈఎంఆర్ఎస్ విద్యార్థులే చెప్పారు. గెలవడం ముఖ్యం కాదని , .భాగస్వామ్యమవడమే గొప్ప అని పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే అని తెలిపారు.గత మూడు రోజుల ఉత్సవాలను నిర్వహించడంలో కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులదరూ ఇదే పోటీ తత్వం తో భవిష్యత్తులోను అన్ని వేదికలపై జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లికార్జున నాయక్ ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి గౌతమీ ఐఏఎస్, నెస్ట్ సహాయ కార్యదర్శి బిపిన్ రాటురి, రంపచోడవరం ఐ టి డీ ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరన్ రాజ్, కేఎల్ యూనివర్సిటీ వీసీ ప్రో .వెంకట్రామన్, ఎస్టి కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, కాకి లక్ష్మి , జిసిసి నెంబర్ కన్నమ రాజు, టిడిపి ఎస్టీ సెల్ చైర్మన్ ఎం ధారు నాయక్. ఎన్ ఈ ఎస్ టీ ఎస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఈఎంఆర్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
![]()
