విజయదుర్గా దేవికి భక్తుల నీరాజనాలు
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సారె సమర్పించిన ధనేకుల కుటుంబం
విజయవాడ పశ్చిమ:- భక్తుల పాలిట కొంగు బంగారంలా నిలుస్తున్న విజయదుర్గా దేవికి తమ కుటుంబం తరఫున ఏటా ఆషాఢ సారె సమర్పించడం తమ పూర్వజన్మ సుకృతమని ధనేకుల వెంకట సుబ్బారావు అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ, 55, 56 డివిజన్ల క్లస్టర్ ఇంఛార్జ్ ధనేకుల వెంకట సుబ్బారావు, వెంకట నరసమ్మ దంపతులు మరియు ఆలయ వ్యవస్థాపకులు మన్నెం శ్రీనివాస్, హసీనా దంపతుల ఆధ్వర్యంలో కంసాలిపేట మెయిన్ రోడ్డులో ఉన్న శ్రీశ్రీశ్రీ విజయదుర్గా దేవి ఆలయంలో కొలువైన జగన్మాత కనకదుర్గమ్మకు మంగళవారం ఉదయం సారె స్థానికులతో కలిసి సమర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు నడుమ పసుపు, కుంకుమ, గాజులు, చలిమిడి, వివిధ రకాల మిఠాయిలు, పండ్లు నెత్తిన పెట్టుకొని కాలినడకన బయలుదేరారు. జైదుర్గా.. జైజై దుర్గా నామస్మరణతో 100 మంది మహిళలు విజయదుర్గా ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని సారె సమర్పించారు. దారి పొడవునా స్థానికులు వార పోస్తూ సారె సమర్పించేందుకు వెళుతున్న మహిళలకు స్వాగతం పలికారు. విజయదుర్గా దేవికి సారె సమర్పించిన అరనంతరం మహిళలు ఒకరికొకరు సారెను ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ధనేకుల వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, గత రెండేళ్లుగా ఆషాఢ మాసంలో తమ ప్రాంతంలో ఉన్న విజయదుర్గ అమ్మవారికి సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఏటా అమ్మవారికి సారె సమర్పిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మరింత వైభవంగా సారె సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ట్రేడర్ కమిటీ అఫిషియల్ స్పోక్స్‌పర్సన్ ధనేకుల వెంకట హరికృష్ణ(నాని) మాట్లాడుతూ, స్థానికులు విజయదుర్గా దేవికి అమ్మవారికి నిత్యం పూజాధికాలు నిర్వహిస్తారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటూ ఏటా సారె సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ధనేకుల ధనలక్ష్మీ, కుమారి, భవాని, వాసా ఆదిలక్ష్మి, డి.పద్మ తులసి, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.