విజయవాడ నగరపాలక సంస్థ 2
3-01-2024
విఎంసి జారీ చేసిన పట్టా రిజిస్ట్రేషన్ గడువు జనవరి 31 వరకు
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నందు పాయకాపురం కాలనీస్ , కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాలవారికి గతంలో విజయవాడ నగర పాలక సంస్థ వారు జారీ చేసిన పట్టాను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఈనెల 31 చివరి తేదీ అని ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు.
పాయకాపురం కాలనీస్, కొత్త రాజరాజేశ్వరి పేట లో 10 సంవత్సరాలు కంటే ఎక్కువగా నివసిస్తున్న వారు విజయవాడ నగరపాలక సంస్థ వారు జారీ చేసిన పట్టా ఇంకా నూ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ కానీ వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేవలం గజం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రధాన కార్యాలయంలో నూతన భవనం లోని గ్రౌండ్ ఫ్లోర్ నందు జరుగుతుందని, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తమతో పాటు ఇంటి పట్టా, లింక్ డాక్యుమెంట్స్, యజమాని ఆధార్ కార్డ్, ఇంటి పన్ను రసీదు, ఇద్దరు సాక్షులు వారి ఆధార్ కార్డుల తో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయగలరని కమిషనర్ తెలిపారు.