వరల్డ్ రికార్డు కోసం జెండాతో చిన్నారుల స్కేటింగ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 80 మంది చిన్నారులు ప్రపంచ రికార్డులు సొంతం చేసుకునేందుకు 95 నిమిషాల పాటు జాతీయ జెండా చేతబట్టి స్కేటింగ్ చేశారు.
విజయవాడ భవానిపురం క్రాంబ్వే రోడ్డులో స్కేటింగ్ కోచ్ ఖాదర్ భాష ఆధ్వర్యంలో 95 నిమిషాల పాటు జాతీయ జెండాలు చేత పట్టి స్కేటింగ్ చేశారు.
ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , టిడిపి మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య పాల్గొని చిన్నారులకు మెడల్స్ ను అందజేసి వారిని అభినందించారు.
స్కేటింగ్ కోచ్ ఖాదర్ భాష మాట్లాడుతూ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకునేందుకు ఈ స్కేటింగ్ ను నిర్వహించామన్నారు. వినూత్న కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా చిన్నారులలో జాతీయతా భావాన్ని పెంపొందించవచ్చని అన్నారు. లండన్ లో మూడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు శిక్షణను ఇచ్చామని భారతీయుడిగా గర్విస్తున్నానని కోచ్ ఖాదర్ భాష ఆనందాన్ని వ్యక్తం చేశారు. 95 నిమిషాల పాటు మువ్వన్నెల జెండా పట్టుకుని
చిన్నారులు చేసిన స్కేటింగ్ పలువురుని ఆకట్టుకుంది.