వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ

2
0

విజయవాడ నగరపాలక సంస్థ
30-07-2025

వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ

వరద ముంపు ప్రాంతాలైన రామలింగేశ్వర నగర్ సాయిరాం కట్ పీసెస్ రోడ్డు, కృష్ణలంక రివర్ ఫ్రంట్ పార్క్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ.

వర్షాకాలం దృశ్య విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో నగర పరిధిలో గల వరద ముంపు ప్రాంతాలలో కార్పొరేషన్ తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ ( వర్షాకాల స్పందన బృందం) లో భాగంగా రామలింగేశ్వర నగర్, కృష్ణలంక ప్రాంతాలు పర్యటించి రిటైనింగ్ వాల్ వద్ద కృష్ణానది ప్రవాహం పెరిగినప్పుడు, రిటైనింగ్ వాల్ దాటకుండా నీటిని ఏ విధంగా మళ్ళిస్తున్నారో వాటిని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశాకు వివరించారు. ఇటువంటి వరద ముంపు ప్రాంతాలలో మాన్సూన్ రెస్పాన్స్ టీం మూడు షిఫ్ట్ లలో పనిచేస్తున్నారని తెలిపారు. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు రిటైనింగ్ వాల్ వద్ద గల ఇంజనీరింగ్ సిబ్బంది ఏర్పాటు చేసిన స్లడ్జి మోటార్ పంపు సహాయంతో వరద నీరును ప్రజలు నివసిస్తున్న ప్రదేశాలకు రానివ్వకుండా డ్రైన్లో మళ్ళిస్తున్న విధానమును వివరించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా మాట్లాడుతూ
కేవలం వరద ముంపు ప్రాంతాలే కాకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 42 స్టాగ్నేషన్ పాయింట్స్ ( వర్షపు నీటి నిల్వలు ఉండే ప్రదేశాలు ) గుర్తించి, ప్రతి పాయింట్ల వద్ద ఏమనిటీస్, ప్లానింగ్, శానిటరీ సెక్రటరీ 24 గంటలు మూడు షిఫ్ట్ లలో పనిచేస్తున్నట్లు తెలిపారు.

విజయవాడ నగర పరిధిలోగల 42 స్టాగ్నేషన్ పాయింట్లలో 24 ఎయిర్ టెక్, 10 గల్ఫర్, 1 సూపర్ సక్కెర్, 69 ఆయిల్ ఇంజన్ మిషనరీస్ తో వర్షపు నీటి నిలువలు రోడ్డుపైన ఉండకుండా, 21 జెసిబి లు, 9 లాంగ్ అర్మ్ ప్రోక్లైమర్స్ తో నగర పరిధిలో గల కాలువలోని నీటి ప్రవాహానికి అంతరాయం కలిగించే వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ కే చైతన్య, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, పర్యవేక్షణ ఇంజనీర్ పి. సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సామ్రాజ్యం, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here