వరద బాధితుల కోసం భారీగా ఆహార పొట్లాలు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే సుజనా కార్యాలయం

Spread the love

 వరద బాధితుల కోసం భారీగా ఆహార పొట్లాలు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే సుజనా కార్యాలయం 

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులు, సహాయక కార్యక్రమాలను వేగవంతం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. వాలంటీర్లు, కూటమి నాయకుల సహకారంతో చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో గత నాలుగు రోజులుగా అనేక వేలమందికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు.వివిధ డివిజన్ల కుటమి నాయకుల సహకారంతో ట్రాక్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లను లోతట్టు ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశ్చిమ ప్రజలకు అండగా ఉంటామని సమస్యలు పరిష్కారమయ్యే వరకు సుజనా చౌదరి కార్యాలయం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ హామీ ఇచ్చారు. ఏ ఒక్కరు ఆకలితో ఇబ్బందులు పడకూడదని ఎంతమందికైనా ఆహారాన్ని అందించడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సిద్ధంగా ఉన్నారన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *