విజయవాడ 06.09.2024
వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకముగా ప్యాక్ చేయిస్తున్న నగర పాలక సంస్థ, జిల్లాయంత్రాంగం
అమ్మ కళ్యాణ మండపం, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ప్యాకింగ్,పంపిణీ చేస్తున్నారు
వరద బాధితులకు పంపిణీకి ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలు సిద్ధం చేస్తున్నారు.
ప్యాకింగ్ చేసే ఒక్కో ప్యాక్ లో ఆరు యాపిల్స్, ఆరుబిస్కట్ ప్యాకెట్ లు, రెండు లీటర్ల పాల ప్యాకెట్లు, మూడు నూడిల్స్ ప్యాకెట్లు, రెండు లీటర్ల వాటర్ బాటిల్స్ ఉంటున్నాయి.
వరద బాధితులు ప్రతీ ఒక్కరికీ అందరికీ అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆరు లక్షల ఆపిల్స్, ఆరులక్షల బిస్కట్ ప్యాకెట్లు, మూడు లక్షల వాటర్ బాటిల్స్, మూడు లక్షల లీటర్ల పాల ప్యాకెట్ లు, నాలుగు లక్షల నూడిల్స్ ప్యాకెట్లను వరద బాధితుల కోసం వాలంటీర్లు, సిబ్బంది ప్యాకింగ్ చేస్తున్నారు