వయోవృద్దులను ఆదరించటం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత -MLA బొండా ఉమ

Spread the love

28-9-2025

వయోవృద్దులను ఆదరించటం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత -MLA బొండా ఉమ

వయోవృద్దులను తనవంతు సహకారంగా ₹70 వేలు సహాయం – MLA బొండా ఉమ

ధి:28-9-2025 ఆదివారం ఉదయం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన అరవింద్‌ ఉషాకటారియా, రోహిత్‌ సంగీత కటారియా సహకారంతో దుర్గాపురం విజయ్‌ నర్సింగ్‌ కళాశాలలో ఆదివారం శతాధిక వృద్ధుల సత్కారం జరిగింది…

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రస్ట్‌ సభ్యులతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ట్రస్టి బొండా సుజాత తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు 14 మంది శతాధిక వృద్దులను ఘనంగా సత్కరించి వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:- దేశంలోనే ఎక్కడా లేని విధంగా శతాధిక వృద్ధులను గుర్తించి వారిని ఒక్కచోటకు తీసుకువచ్చి సత్కారం చేయటం అభినందనీయం అని, ట్రస్టీల సహకారంతో 18 సంవత్సరాలుగా వయోవృద్ధులకు నిత్యావసర సరుకులు అందించటంతో పాటు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేయడం మంచి పరిణామం అని…

సర్వమానవాళి సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రజలకు దైవానుగ్రహం లభించాలని ప్రతీ ఏటా శతాధిక వృద్దుల సత్కారం ట్రస్ట్ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, పది మంది శతాధిక వృద్ధులను ఒక్కచోట చేర్చి వారి ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా సాక్షాత్తూ దైవానుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని, అనంతరం శతాధిక వృద్దులను శాలువా, జ్ఞాపిక, నగదు బహమతితో ఘనంగా సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు….

అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యులు వయోవృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు, ఈ సంధర్భంగా వయోవృద్ధులకు నిర్వహించిన ఆటల పోటీలలో వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు,మద్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది..

ఈ కార్యక్రమంలో ట్రస్టీలు తట్టి అర్జునరావు, అమరా ఉమామహేశ్వరరావు, ఎన్‌వీయూ సతీష్‌కుమార్, కె మధుసూధనరావు, పీ లక్ష్మీనరసింహరావు, వెంకటేష్‌ గోదావరి తదితరులు పాల్గొన్నారు…

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *