వంశధార ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందించండి
ఎత్తిపోతల పథకాల నుంచి తాత్కాలికంగా నీరు నిలుపుదల చేయండి
ప్రస్తుతం ఉన్న నీటి సామర్ధ్యం కంటే మరో 200 క్యూసెక్ లు పెంచాలి
కాలువల్లో నీరు సజావుగా పారుదలకు తాత్కాలిక సిబ్బందిని నియమించండి
శివారు ప్రాంతాలకు సైతం సాగునీరు అందించాలి
ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు
నిమ్మాడ, జూలై 28: శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వంశధార ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందే విధంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుగారు ఆదేశించారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో సోమవారం అధికారుతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ వంశధార ఎడమ కాలువ పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సూచించారు. ప్రధానంగా పలాస, మేఘవరం, టెక్కలి, నందిగాం మండలాల పరిధిలో ఉన్న శివారు ఆయకట్టుకు నీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవలన్నారు. ప్రస్తుతం గొట్టాబ్యారేజీ నుంచి ఎడమ కాలువ ద్వారా అందిస్తున్న 1600 క్యూసేక్‌ల నీరుకు అదనంగా మరో 200 పెంచాలని సూచించారు. ఎడమ కాలువ ఆయకట్టులో పరివాహక ప్రాంతాల్లో ఉన్న మండలాలకు మినహాయించి ముందుగా దిగువ ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం నారుమళ్లు సిద్దంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు నాటులు నాటువేసేందుకు వీలుగా నీరు అందించాలని చెప్పారు. ఆ దిశగా అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించాలని ఆదేశించారు. మరో వైపు కాలువలకు గండ్లు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నీరు సజావుగా వేల్లేందుకు పర్యవేక్షించేందుకు తాత్కాళిక సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుంగా సాగునీరు అందించడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు ఛైర్మన్ అరవల రవీంద్ర, ఇరిగేషన్ అధికారులు స్వర్ణకుమార్, బి.శేఖర్, మన్మధరావు, తదితరులు పాల్గొన్నారు.
28.7.25
నిమ్మాడ
వంశధార ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందించండి
ఎత్తిపోతల పథకాల నుంచి తాత్కాలికంగా నీరు నిలుపుదల చేయండి
ప్రస్తుతం ఉన్న నీటి సామర్ధ్యం కంటే మరో 200 క్యూసెక్ లు పెంచాలి
కాలువల్లో నీరు సజావుగా పారుదలకు తాత్కాలిక సిబ్బందిని నియమించండి
శివారు ప్రాంతాలకు సైతం సాగునీరు అందించాలి
ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు