
వందేమాతరం” చిత్ర రూప ప్రదర్శన అద్భుతం: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన చిత్ర రూప ప్రదర్శన అద్భుతంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు.స్థానిక కలెక్టరేట్ లో వందేమాతరం చిత్ర రూప ప్రదర్శన ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ…. దేశ స్వాతంత్ర సమరానికి స్ఫూర్తినిచ్చిన వందేమాతర గేయాన్ని చిత్ర రూపంలో తీసుకురావటం అభినందనీయమన్నారు. భారతజాతికి స్వాతంత్ర నినాదమైన “వందేమాతరం” సారాంశాన్ని చిత్రరూపం ద్వారా యువతకు సులభంగా తెలియజేయవచ్చన్నారు. వందేమాతరంలోని భావం మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, నిత్యస్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. సృజనాత్మకతతో చిత్రాలను రూపొందించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావును కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమాధికారి యు.శ్రీనివాసరావు, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
