వంగలపూడి అనిత ముందు ఏడ్చేశా: హోంమంత్రిని కలిసిన అనంతరం శాంతి భర్త

Spread the love

 

అమరావతి

వంగలపూడి అనిత ముందు ఏడ్చేశా: హోంమంత్రిని కలిసిన అనంతరం శాంతి భర్త

ప్రాణాలకు ముప్పు ఉంది… రక్షణ కల్పించాలని కోరిన మదన్ మోహన్

తన కుటుంబానికి న్యాయం చేయమని కోరినట్లు వెల్లడి

తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన

సస్పెండైన దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి భర్త మదన్ మోహన్ గురువారం సాయంత్రం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. తన ప్రాణానికి, తన బిడ్డ ప్రాణానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మంత్రి అనితను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనను, తన పిల్లల్ని కాపాడుకోవడానికే మీడియా ముందుకు వచ్చానన్నారు. తన కుటుంబానికి న్యాయం చేయమని మంత్రిని కోరినట్లు చెప్పారు.

నాలుగు రోజులుగా జరుగుతున్న అంశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తనతో చెప్పారన్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని మేడం గ్యారెంటీ ఇచ్చారన్నారు. ఓ సమయంలో ఎమోషనల్ అయి మేడం వద్దనే తాను ఏడ్చానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు.

తాను అమెరికాలో ఉన్నప్పుడు ఝాన్సీని తన బిడ్డగానే తన భార్య శాంతి చెప్పిందన్నారు. దీంతో ఆ బిడ్డతో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యానన్నారు. తనను నయవంచనకు గురి చేశారన్నారు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు మొదట చెప్పిందని, ఆ తర్వాత మాటలు మార్చిందన్నారు. పూర్తిగా ఆరా తీయడంతో అసలు విషయం చెప్పిందన్నారు. ఏ భర్త కూడా బయటకు వచ్చిన తన భార్యపై అపనింద వేయరని గుర్తుంచుకోవాలన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *