లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ చిన్ని

Spread the love

 26-06-2024

లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ చిన్ని

ఢిల్లీ : పార్ల‌మెంట్ లో బుధ‌వారం 18వ లోక్ స‌భ‌కి జ‌రిగిన స్పీక‌ర్ ఎన్నిక ప్ర‌క్రియ‌లో విజ‌యం సాధించి బిజెపి ఎంపి ఓం బిర్లా ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) మర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. లోక్ స‌భ వాయిదా స‌మ‌యంలో ఆయ‌న ఛాంబ‌ర్ కి వెళ్లి క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. వ‌రుస‌గా రెండో సారి లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ఎన్నికైనంద‌కు అభినంద‌న‌లు తెలిపారు. లోక్ స‌భ స‌జావు సాగేందుకు, పార్ల‌మెంట‌రీ సంప్ర‌దాయాల‌ను కొన‌సాగించ‌టంలో, విజ్ఞతతో నిష్పక్షపాతం గా వ్య‌వ‌హ‌రిస్తూ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *