లోకేష్ ను కలిసిన రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్… మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్… మాధవ్ ను మంగళగిరి శాలువాతో సత్కరించారు. ప్రతిపక్షంలో ఉండగా శాసనమండలిలో ప్రజాసమస్యలపై కలిసి పోరాడిన సందర్భాన్ని ఇద్దరు నేతలు నెమరు వేసుకున్నారు. మృదు స్వభావిగా పేరున్న మాధవ్ కు రాష్ట్ర సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని లోకేష్ అన్నారు.