
విజయవాడ నగరపాలక సంస్థ
29-10-2025
రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
రోడ్డుపైన వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యల తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్, లయోలా కాలేజ్ రోడ్, జమ్మి చెట్టు సెంటర్, సిద్ధార్థ కాలేజ్ రోడ్డు, ఈఎస్ఐ రోడ్, ఏలూరు రోడ్, బస్టాండ్ నేషనల్ హైవే, భారతి నగర్, ఫార్చ్యూన్ మురళి పార్క్ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షపు నీటి నిల్వలను ఎక్కడ నిలవకుండా ఎయిర్ టెక్ మిషిన్లు, గల్ఫర్ లతో ఎప్పటికప్పుడు తొలగించాలని, మొన్సూన్ రెస్పాన్స్ టీం అప్రమత్తంగా ఉంటూ రోడ్డుపైన నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చౌకింగ్ పాయింట్లు, ఫ్లోటింగ్ గార్బేజ్ లను అవుట్ఫాల్ట్ డ్రైనలలో ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
తన పర్యటనలో డోర్నకల్ రోడ్డు, అలీ బైక్ స్ట్రీట్ గవర్నర్‌పేట, బస్టాండ్‌కు వెళ్లే జాతీయ రహదారి వద్ద గల యం. హోటల్, భారతి నగర్ మరియు ఫార్చ్యూన్ మురళి పార్క్ వద్ద రహదారుల పైన పడిపోయిన వృక్షాలను గమనించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే వృక్షాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగరం మొత్తం ప్రత్యేక బృందాలతో తుఫాను ఈదురుగాలుల వల్ల పడిపోయిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు.
తదుపరి గులాబీ తోటలో ఉన్న అన్న క్యాంటీన్ లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుఫాను నేపథ్యంలో అన్న క్యాంటీన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, అందుకు తగ్గట్టుగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏమైనా మరమ్మతులు వచ్చినచో వెనువెంటనే వాటిని పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.
![]()
