రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తన ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు వెచ్చించి క్రీడా ప్రాంగణాన్ని సమకూర్చారు.

Spread the love

 రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  తన ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు వెచ్చించి క్రీడా ప్రాంగణాన్ని సమకూర్చారు.

గురువారం ఇందుకు సంబంధించిన మొత్తాన్ని చెక్కు రూపంలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ  పిడుగు హరిప్రసాద్  స్థల విక్రేతలకు అందజేశారు. స్థల విక్రేత  పగడాల పద్మావతి తరఫున ఆమె కుమారులు  పగడాల వెంకటేష్,  పగడాల చంద్రశేఖర్ లు రూ. 60 లక్షల చెక్కును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్  కళ్యాణం శివశ్రీనివాస్ పాల్గొన్నారు.  పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ నుంచి నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలకు ఎకరం స్థలం కొనుగోలు చేసి ఆ గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన సంగతి విదితమే.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *