మైలవరం నియోజకవర్గంలో అన్నదాతలకు రూ.20.19 కోట్లు జమ.
రైతే రాజు…రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి.
దార్శనికులు సీఎం చంద్రబాబు అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతున్నారు.
-మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదు
పండుగ వాతావరణంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ.
కవులూరుకు తరలిన కర్షకులు.
ఎంపీ కేశినేని చిన్ని తో కలసి పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు (కవులూరు), 02/08/2025.
మైలవరం నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది అన్నదాతలకు రూ.20.19 కోట్ల రూపాయలు ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) తో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రైతన్నల ఆనందోత్సాహల నడుమ పూర్తిగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. మైలవరం నియోజకవర్గంలోని కర్షక సోదరులంతా కవులూరుకు విచ్చేశారు.
పీఎం మోడీ వారాణసిలో ‘పీఎం కిసాన్’ నిధులు విడుదల, దర్శిలో సీఎం చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాలను ఆన్ లైన్లో వీక్షించారు.
ఈ సంధర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ
“రైతే రాజు…రైతు లేనిదే రాజ్యం లేదు…రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కూటమి ప్రభుత్వం నేడు పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకు రూ.7 వేలు తొలి విడతగా అందజేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ కింద మైలవరం నియోజకవర్గంలో రూ.15.12 కోట్లు రైతుల ఖాతాలో జమ, దాదాపు 30,241 మంది రైతులకు లబ్ది కలుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన కింద మైలవరం నియోజకవర్గంలో రూ.5.07 కోట్లు రైతుల ఖాతాలో జమ, దాదాపు 25,336 మంది రైతులకు లబ్ది చేకూరుతుంది.
జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామం మైలవరం నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వేదిక కావడం చాలా సంతోషం.
ఒక పక్క అభివృద్ధి చేస్తూనే… పేదలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టింది. నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసింది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేసింది. దాదాపు 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాడు.
మద్యం కుంభకోణంలో రూ.3,500 కోట్లు దోచేశారు. ఇటీవల హైదరాబాదులో రూ.11 కోట్లు కూడా సీజ్ చేశారు. సిట్ అధికారులు దాదాపు రూ.100 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం మద్యం సేవించి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇసుక కుంభకోణంలో కూడా వేలాది కోట్ల అవినీతి జరిగింది.
దార్శనికులు సీఎం చంద్రబాబు దాదాపు గంటన్నర మండుటెండలో దర్శిలో నవయువకునిలా శ్రమించారు.
గతయేడాది బుడమేరు వరదలలో కూడా 11 రోజుల పాటు విజయవాడలో మకాం వేసి జోరువానలో, వరద నీటిలో తిరిగి సీఎం చంద్రబాబు సేవలందించారు.
కవులూరు-శాంతినగర్ మధ్య బీడీసీ గండ్లను రిటైనింగ్ వాల్ కట్టి శాశ్వత ప్రాతిపదికన పూడ్చి వేశాం. వరదనీటి ముంపు నివారణకు శాశ్వతంగా చర్యలు తీసుకున్నాం.
సూపర్ సిక్స్ హామీలైన దీపం కింద మూడు ఉచిత సిలిండర్లు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపు, అన్నదాత సుఖీభవలను ప్రభుత్వం అమలు చేసింది.
ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కూడా అమలు చేసున్నాం.
అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం మూడు విడతలుగా అందించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000, కేంద్ర పీఎం కిసాన్ కింద రూ.6,000 కలిపి చెల్లింపులు వస్తాయి. మొదటి విడతగా రూ.5,000 (రాష్ట్రం), రూ.2,000 (కేంద్రం) కలిపి ఒక్క రైతు ఖాతాలో రూ.7,000 నేడు జమ అవుతోంది.
అక్టోబర్ లేదా నవంబరులో రెండవ విడతగా మరో రూ.7,000 చెల్లిస్తారు.మూడవ విడతలో రూ.6,000 (రూ.4,000 రాష్ట్రం, రూ.2,000 కేంద్రం) ఇవ్వనున్నారు.మొత్తం సంవత్సరానికి ఒక్క రైతు కుటుంబానికి రూ.20,000 వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
దీనివల్ల రాష్ట్రంలో 46.86 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. రైతు సోదరుల తరపున ప్రధాని మోడీ కి, సీఎం చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి కృతజ్ఞతలు.
కవులూరులో రహదారుల అభివృద్ధికి, తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణకు కృషి జరుగుతోంది.
మైలవరం నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చి ఇందులో భాగస్వామ్యులైన రైతు సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా అతిధ్యమిచ్చిన కవులూరు రైతులకు నా కృతజ్ఞతలు.” అని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) , వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.