వ్యవసాయ శాఖ రైతు అవసరాలకు తగ్గట్లు పరిశోధనలు చేపట్టాలి డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు.#) శాస్త్రవేత్తలకు సూచించిన డిల్లీ రావు #)యన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని డాక్టర్ కె ఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం లో *వికసిత కృషి సంకల్పఅభియాన్* పాల్గొన్న వ్యవసాయ సంచాలకులు .#)దేశములో మొట్ట మొదట సారిగా శాస్తవేత్తలతో ఖరీఫ్ సన్నద్ధత,అవగాహన పై గ్రామస్థాయిలో రైతుల పంట పొలాల్లో పరిశీలన #) కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న అవగాహన కార్యక్రమం . వ్యవసాయ శాస్త్ర వేత్తలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతు అవసరాలను కేంద్రీకృతం చేసుకుని ,వాటికి తగ్గట్టు పరిశోధనలను చేబట్టాలని రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు శాస్త్రవేత్తలను కోరారు .యన్ టి ఆర్ జిల్లాలలోని గరికపాడు కె వి కె నందు ఈ రోజు జరిగిన *వికసిత కృషి సంకల్ప అభియాన్* కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ రోజు 29 నుండి వచ్చే నెల జూన్ 12 వరకు వ్యవసాయం మరియు అనుబంధ రంగములైన పశుసంవర్ధక ,మత్స్య ,పౌల్ట్రీ రైతులకు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్ర వేత్తలు ,కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థలలోని శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలోనీ రైతుల పొలాల వద్దకు అందుబాటులో ఉండి ,తగు సాంకేతిక సూచనలను అందిస్తారని తెలిపారు . ఈ కార్యక్రమంలో రైతులు పూర్తి స్థాయిలో పాల్గొని వారి అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు .ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్ష మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రోద్బలంతో రైతులు వారి పంట ఉత్పత్తులను పెంచే దిశగా ఈ పథకం రూపొందించడం జరిగిందని తెలిపారు.శాస్త్రవేత్తలు సాగు రైతులకు వారి పరిశోధనస్థానాలలోని* నూతన సాంకేతిక ఆవిష్కరణలను *పంట పొలాలవరకు* ( పరిశోధన ల నుండి పంట పొలాల వరకు ) ఈ కార్యక్రమము ద్వారా తీసుకెళ్లాలని కోరారు .రైతులు ఆర్థికంగా బలోపేతానికి అయ్యే ప్రక్రియ కు అదనంగా జ్ఞానసముపార్జన చేయడం ద్వారా సంపూర్ణ సంపన్న రైతులుగా ఎదగ వచ్చని ,అటువంటి వారు దేశానికి గర్వకారణం అని తెలిపారు. శాస్త్రవేత్తలు ఈ వేదికల ద్వారా రైతులకు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానంను అవగాహన కల్పించి రైతులను సాధికారం సాధించి సంపన్నులుగా మార్చే దిశగా ఈ కార్యక్రమము ఉండాలని కోరారు . క్షేత్ర సందర్శనలో భాగముగా అనుమంచిపల్లి గ్రామంలో జరిగిన *డ్రోన్ వినియోగం – సాంకేతిక పరిజ్ఞానం* పై క్షేత్ర ప్రదర్శన , పరిశీలనలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో కె వి కె కోఆర్డినేటర్ అచ్యుత రాజు , శాస్త్ర వేత్తలు శివప్రసాద్ ,వెంకట్ రెడ్డి,రాజశేఖర్ ,లక్ష్మీకళ ,జస్వంత్ రెడ్డి ,ప్రభావతి ,యన్ టి ఆర్ జిల్లా వ్యవసాయ అధికారీ విజయకుమారి ,రైతులు ,వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు .
