రైతుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమే : యార్లగడ్డ
హనుమాన్ జంక్షన్ :
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుని వారి నుండి అర్జీలు స్వీకరించిన ఆయన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఇతోదికంగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో రైతులు ఖాతాలో డబ్బు జమ చేసిన సంగతి గుర్తు చేశారు. బుడమేరు వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం విడుదల చేసి రైతులను ఆదుకున్నామన్నారు. ఏడాది ముందుగానే సాగునీటిని విడుదల చేసినట్లు చెప్పారు. రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాలను పెంచినట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో రసాయన ఎరువుల కొరత నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండేళ్లలో గన్నవరం నియోజకవర్గ ముఖచిత్రం మారనుందని జోశ్యం చెప్పారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలుపుతానని ప్రజలందరూ తనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ నిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం, ఆళ్ల గోపాలకృష్ణ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దయ్యాల రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్ రాష్ట్ర తెలుగు రైతు నాయకులు గుండపనేని వరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కొండపల్లి వెంకన్న మాజీ సర్పంచ్ ఆర్నెపల్లి సూరిబాబు గ్రామ సర్పంచ్ ఆర్నెపల్లి రవివర్మ, జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గండిపూడి నితీష్ కుమార్, చలసాని శ్రీను, డీసీ చైర్మన్ కొమ్మరెడ్డి రాజేష్, మొవ్వ వెంకటేశ్వరరావు, బొమ్ములూరు ,దంటగుంట్ల సర్పంచులు కాటూరి విజయభాస్కర్, యజ్జవరపు రంగారావు, చిన్నారి చిన్నా, సింగవరపు చంద్రమౌళి, ప్రసాద్ పాల్ కర్ర, మోవ్వ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు…