రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : యార్లగడ్డ
కృష్ణా డెల్టా కి సకాలంలో సాగునీరు విడుదల చేసాం
గన్నవరం :
రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తమ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ గత ఏడాదికాలంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల నుండీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్న ఆయన వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలను తాము అధికారం చేపట్టిన వెంటనే చెల్లించినట్లు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల వద్ద నుండి 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, ధాన్యం సొమ్మును నెలలోపు రైతుల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. ఏడాది ప్రకృతి అనుకూలించడంతో కృష్ణా డెల్టాకు సకాలంలో సాగునీటిని విడుదల చేశామన్నారు. గత ఐదేళ్లుగా సాగునీటి కాలువల మరమ్మత్తులు చేపట్టకపోవడంతో కాలువలు పూడుకుపోయి రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతుల ఇబ్బందులను గమనించిన తమ ప్రభుత్వం వర్షాలు ప్రారంభం కావడానికి ముందే పంట కాలువల మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు. గన్నవరం నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ద్వారా పంటకాలువల పూడికలు తీయించి సాగునీరు సక్రమంగా పారేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని అర్హత గల రైతులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు వ్యవసాయ పనిముట్లు, స్ప్రేయర్లు తదితర యంత్ర పరికరాలు రాయితీ పై ఇస్తున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ద్వారా ఆధునీకరణ అభివృద్ధి పనులకు ఈ ఏడాది కాలంలో రూ.85 లక్షల ఖర్చు చేసినట్లు వివరించారు. పాడి రైతులకు సహాయం చేయూత నిచ్చేందుకు రూ. 3.26కోట్ల ఖర్చుతో 186 మినీ గోకులం షెడ్లు నిర్మించినట్లు యార్లగడ్డ వివరించారు. నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, దయాల రాజేశ్వరావు, కొలుసు రవీంద్ర, గొడ్డల చిన్న రామారావు, మండల ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కోసూరి వెంకటేష్, అన్నే అంజి బాబు, అన్నే హరి కృష్ణ, మల్లంపాటి బన్ను, మూల్పూరి లక్ష్మి ప్రసాద్, గూడపాటి దుర్గ ప్రసాద్, కోనేరు సందీప్, ముల్పూరి భాను, జస్థి కిషోర్, రాష్ట్ర నాయకులు చిరుమామిళ్ల సుర్యం, గుడవల్లి నరసయ్య, అల్లా గోపాలకృష్ణ, దొంతు చిన్న, బొప్పన హరికృష్ణ, సర్నాల బాలాజీ, ఎంపీటీసీ సభ్యులు పడమట రంగారావు, కొమ్మరాజు సుధీర్, కసర్నెని రంగబాబు, పుట్ట సురేష్, తంగిరాల శ్రీనివాస్, తెలుగు యూవత నాయకులు పరుచూరి నరేష్, కొసరాజు సాయిరాం, జనసేన నాయకులు చీమాట రవి వర్మ, తదితరులు పాల్గొన్నారు