రైతులు వ్యవసాయంతో పాటు,పాడి పశువులను అభివృద్ధి చేసుకుంటే అధిక లాభాలు. మంత్రి నాదెండ్ల మనోహర్

0
0

రైతులు వ్యవసాయంతో పాటు,పాడి పశువులను అభివృద్ధి చేసుకుంటే అధిక లాభాలు.

ప్రతి రైతు వ్యవసాయంతో పాటు కనీసం రెండు గేదెలను పెంచుకోవాలి,కుటుంబానికి ఆర్థికంగా తోడుంటుంది.

చోదిమెళ్ళ పశువైద్య శిబిరం మరియు లేగదూడలు అందాల పోటీలను జిల్లా ఇంచార్చి,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి,ఏలూరు శాసనసభ్యులు బడేటి వెంకట రాధాకృష్ణయ్య ( చంటి) సంయుక్తంగా ప్రారంభించారు.

   ఏలూరు,జూలై 15: ఏలూరు మండలం చోదిమెళ్ళ గ్రామ సచివాలయం వద్ద మంగళవారం పశువైద్య శిబిరం మరియు లేగదూడలు అందాల పోటీలను జిల్లా ఇంచార్జ్ ,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి,ఏలూరు శాసనసభ్యులు బడేటి వెంకట రాధాకృష్ణయ్య ( చంటి) సంయుక్తంగా ప్రారంభించి,లేగ దూడల జాతి,తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోజిల్లా ఇంచార్జ్ , రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులకు అదనపు ఆదాయం ఇచ్చేది పాడి పశువులని, పాడి పశువుల కొనుగోలుకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని మంత్రి చెప్పారు.  పల్లెసీమలో  పశువైద్య శిబిరం మరియు లేగదూడలు అందాల పోటీలను ప్రారంభించి పాల్గొనుట నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఎంతో ఆనందం కలిగిందన్నారు. దేశంలో మన రాష్ట్రం అన్ని రంగాలను అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు.ఈ గ్రామంలో నాలుగు వందల పశు రైతు కుటుంబాలు ఉన్నాయని ఇది మంచి  శుభపరిణామం అన్నారు.ఈ గ్రామంలో పశు వైద్య హాస్పటల్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ లోపుగా పశువైద్యాధికారిని వారానికి నాలుగు రోజులు ఈ గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.పశువులకు వైద్యం,మేలుజాతి పశువులు అందించి పాడి రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని రైతు సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు,లేగదూడలు అందాల పోటీ నిర్వహించటం మంచి శుభపరిణామం అన్నారు. ప్రతి రైతు పంటలతో పాటు కనీసం రెండు పాడి గేదలను తప్పక పెంచుకుంటే కుటుంబం ఆర్థికంగా ముందుకు సాగుతుందని అన్నారు.

  లేగ దూడలు,ఆవు పెయ్యలు అందాల పోటీలలో గెలిచిన మొదటి, ద్వితీయ,తృతీయ బహుమతులుగా ట్రోపీలు,మందులు కిట్లను 

జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి,ఏలూరు శాసనసభ్యులు బడేటి వెంకట రాధాకృష్ణయ్య ( చంటి) ఆయా రైతులకు అందించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, విజయవాడ ప్రాంతీయ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి టి.గోవిందరాజు, మండల వివిధ శాఖల అధికారులు, పాడి రైతులు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here